సిలిండర్ లో గ్యాస్ ఎంత లెవెల్ వరకు ఉందో ఈజీగా ఇలా తెలుసుకోండి! - How to identify Gas level in Cylinder?
సిలిండర్ లో గ్యాస్ ఎంత లెవెల్ వరకు ఉందో ఈజీగా ఇలా తెలుసుకోండి! - How to identify Gas level in Cylinder? |
మనం జనరల్గా వంట చేసేటప్పుడు, గ్యాస్ సిలిండర్ పెట్టి ఎన్ని రోజులు అయ్యిందో, గ్యాస్ ఇంకా ఎన్ని రోజులు వస్తుందో, వంట మధ్యల ఆగిపోతుందో అని ఆలోచిస్తూ ఉంటాను కదా, మామూలుగా మనం గ్యాస్ ఎంతుందో తెలుసుకోవడానికి, గ్యాస్ ఎత్తి దాన్ని చూస్తూ ఉంటాం, సిలిండర్ నీ అటు ఇటు షేక్ చేసే చూస్తూ ఉంటాం, అలా చేయడం కష్టమైన పని కదండి, అలా కాకుండా గ్యాస్ సిలిండర్లు గ్యాస్ ఎంతవరకు ఉందో ఎలా చూడాలో అని అందరికీ డౌట్ ఉంటుంది కదా.
నేను ఈరోజు గ్యాస్ లెవెల్ ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి, ఒక ఈజీ టిప్ చెప్పబోతున్నాను, ఈజీ మెథడ్ తో మీరు సులభంగా కనుక్కోవచ్చు, అది ఎలాగంటే, దీంట్లో ఎంత వరకు గ్యాస్ ఉందో తెలియదు, గ్యాస్ లెవల్ తెలుసుకోవడానికి, ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోండి, ఒక నాప్కిన్ నీళ్లల్లో ముంచి అంత తడి అయ్యేలా చూసుకోవాలి, ఇలా నాప్కిన్ తడి చేసిన తర్వాత, ఆ వాటర్ ని పిండేసేయండి.
ఈ తడిగా ఉన్న టవల్తో సిలిండర్ పైన ఒక సైడ్ పై నుండి కింది వరకు తుడవండి, తుడిచిన తర్వాత నాలుగైదు నిమిషాలు వెయిట్ చేయాలి ఫ్యాన్ ఆఫ్ చేసి చూడండి, ఫ్యాన్ ఉంటే తడి తొందరగా ఆరిపోతుంది, మనకి గ్యాస్ లెవెల్ కరెక్టుగా తెలియదు అనమాట, అందుకనే ఫ్యాన్ ఆఫ్ చేసి నాలుగైదు నిముషాలు వెయిట్ చేయండి, 4 ,5 నిమిషాల తర్వాత గ్యాస్ అయిపోయిన దగ్గర, తడి తొందరగా ఆరిపోయి ఉంటుంది.
గ్యాస్ ఉన్న దగ్గర తడి ఉంటే అది నెమ్మదిగా ఆరిపోతుంది చూడండి, పైన తడి తొందరగా అయిపోయింది, కింద తడి ఆరలేదు అంటే, ఇక్కడ వరకు గ్యాస్ ఉందని తెలుస్తోంది, ఈ విధంగా మనం ఈజీగా వాటర్ తో గ్యాస్ ఎంత ఉందో అని తెలుసుకోవచ్చు, ఇది ఎలా అంటే మన సిలిండర్ ఎల్పిజి గ్యాస్ వచ్చేసి, 85% లిక్విడ్స్ ఉంటాయండి, అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అన్నమాట, మిగతా ప్లేస్లో ఎల్పీజీ వచ్చేసి గ్యాస్ స్టేట్లో ఉంటుంది.
మనం గ్యాస్ యూస్ చేసేటప్పుడు లిక్విడ్ గ్యాస్ లాగా బయటకు వస్తుందన్నమాట, అప్పుడు మనకు గ్యాస్ వెలుగుతుంది, మనం గ్యాస్ యూస్ చేస్తూ ఉంటే లిక్విడ్ గ్యాస్ గా మారి, నెమ్మదిగా లిక్విడ్ గ్యాస్ అయిపోతుంది, ఈ విధంగా మనకు గ్యాస్ అయిపోతుంది అన్నమాట, ఈ విధంగా మనం సిలిండర్ పైన వాటర్ పోస్తే, లిక్విడ్ స్టేట్ లో ఉన్న గ్యాస్ వచ్చేసి, పైన పోసిన వాటర్లో వేడిని తగ్గిస్తుంది అన్నమాట, అందుకని వాటర్ అంత తొందరగా ఆవిరి అవ్వదు
No comments:
Post a Comment