Aadhaar Card: ఒకే మొబైల్ నెంబర్‌తో కుటుంబంలో అందరికీ ఈ ఆధార్ సర్వీస్ - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Saturday, February 5, 2022

Aadhaar Card: ఒకే మొబైల్ నెంబర్‌తో కుటుంబంలో అందరికీ ఈ ఆధార్ సర్వీస్

Aadhaar Card: ఒకే మొబైల్ నెంబర్‌తో కుటుంబంలో అందరికీ ఈ ఆధార్ సర్వీస్

 Aadhaar Card: ఒకే మొబైల్ నెంబర్‌తో కుటుంబంలో అందరికీ ఈ ఆధార్ సర్వీస్

Aadhaar Card | ఆధార్ కార్డ్ సర్వీసులు పొందాలంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి. అయితే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేకపోయినా మీ కుటుంబ సభ్యులందరికీ ఈ ఆధార్ సర్వీస్ (Aadhaar Service) సులువుగా పొందొచ్చు


యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అందించే ఆధార్ సేవలు పొందాలంటే మొబైల్ నెంబర్ తప్పనిసరి. ఆధార్ కార్డ్ (Aadhaar Card) నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌తోనే ఆధార్ సేవలు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఒకే మొబైల్ నెంబర్‌తో కుటుంబ సభ్యులందరికీ ఓ ఆధార్ సర్వీస్‌ను పొందొచ్చు. ఆధార్ పీవీసీ కార్డ్ ప్రింట్ తీసుకోవడానికి ఈ అవకాశం ఇస్తోంది యూఐడీఏఐ. ఆధార్ కార్డును మూడు ఫార్మాట్లలో అధికారికంగా అంగీకరిస్తారు. ఆ ఫార్మాట్లు తప్ప ఇతర పద్ధతుల్లో ఉన్న ఆధార్ కార్డులను ఒరిజినల్ కార్డులుగా పరిగణించరు. అవేంటో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. వేలిడ్‌గా భావించే ఫార్మాట్లలో ఆధార్ పీవీసీ కార్డు ఒకటి. ఆధార్ పీవీసీ కార్డ్ ఏటీఎం కార్డ్ సైజులో ఉంటుంది. ఈ కార్డును ఒరిజినల్ ఆధార్ కార్డు లాగా ఉపయోగించుకోవచ్చు. ఇటీవల ఆధార్ కార్డ్ హోల్డర్లు ఆధార్ పీవీసీ కార్డు తీసుకుంటున్నారు.


ఆధార్ పీవీసీ కార్డు తీసుకోవాలంటే యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయి ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అయితే మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ మీ మొబైల్ నెంబర్‌తోనే ఆధార్ పీవీసీ కార్డు ఆర్డర్ చేయొచ్చు. ప్రతీ ఒక్కరి కోసం వేర్వేరు మొబైల్ నెంబర్స్ అవసరం లేదు. ఒక ఆధార్ పీవీ కార్డుకు రూ.50 చెల్లించాలి. మరి మీ కుటుంబ సభ్యులకు ఆధార్ పీవీసీ కార్డు ఎలా ఆర్డర్ చేయాలో తెలుసుకోండి.


Aadhar Card: మీ ఆధార్ కార్డును ఎవరైనా వాడుతున్నారా? ఇలా తెలుసుకోండి


ఆధార్ పీవీసీ కార్డు ఆర్డర్ చేయండి ఇలా


Step 1- ముందుగా https://myaadhaar.uidai.gov.in/ లేదా https://uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.


Step 2- Order Aadhaar PVC Card సర్వీస్ పైన క్లిక్ చేయాలి.


Step 3- ఆ తర్వాత ఎవరి ఆధార్ కార్డ్ ప్రింట్ తీసుకోవాలనుకుంటే వారి 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 28 అంకెల ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఎంటర్ చేయాలి.


Step 4- ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి.


Step 5- “If you do not have a registered mobile number, please check in the box” ఆప్షన్‌కు టిక్ చేయాలి.


Step 6- ఆ తర్వాత ప్రత్యామ్నాయ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Send OTP పైన క్లిక్ చేయాలి.


Step 7- ఆ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.


Step 8- అయితే ఇక్కడ ఆధార్ వివరాల ప్రివ్యూ కనిపించదు.


Step 9- చివరగా Make payment ఆప్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి.


Step 10- నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డుతో పేమెంట్ చేయొచ్చు.


పేమెంట్ పూర్తైన తర్వాత డిజిటల్ సంతకంతో ఉన్న ఆధార్ పీవీసీ కార్డ్ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్‌కు పోస్టులో వస్తుంది.

No comments:

Post a Comment

Post Top Ad