ఈ దంపతులు సామాన్యులు కారు.. రాత్రయిందంటే చాలు.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వీరు చేసే పనులు ఏంటో తెలుసా.. - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Thursday, February 17, 2022

ఈ దంపతులు సామాన్యులు కారు.. రాత్రయిందంటే చాలు.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వీరు చేసే పనులు ఏంటో తెలుసా..

ఈ దంపతులు సామాన్యులు కారు.. రాత్రయిందంటే చాలు.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వీరు చేసే పనులు ఏంటో తెలుసా..

ఈ దంపతులు సామాన్యులు కారు.. రాత్రయిందంటే చాలు.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వీరు చేసే పనులు ఏంటో తెలుసా..

కొందరు పైకి చూసేందుకు ఎంతో మంచివారిలా కనిపిస్తారు. అయితే వారిలోని చీకటి కోణం బయటపడిన రోజు అంతా షాక్ అవుతుంటారు. బెంగళూరులో ఓ జంట ఇలాగే ఎవరికీ అనుమానం రాకుండా తమ పనులు తాము కానిచ్చేవారు. పగటి పూట మాత్రం హుందాగా ఎవరి పనులు వారు చేసుకునేవారు. చీకటి పడిందంటే చాలు.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దకు వెళ్లి, తమ అసలు పని మొదలెట్టేసేవారు. ఈ స్టోరీలో చివరకు ఏం జరిగిందంటే..

సిఖిందర్, నజ్మా దంపతులుబెంగళూరు నగరంలోని సబర్బన్ పరిధి చిక్కబాణవర ప్రాంతంలో సిఖిందర్, నజ్మా దంపతులు నివాసం ఉంటున్నారు. స్థానిక టౌన్‌షిప్ ప్రాంతంలో సిఖిందర్.. టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడి భార్య.. ఓ దుస్తుల దుకాణంలో పని చేసేది. చుట్టు పక్కల వారి దృష్టిలో వీరికి చాలా మంచి పేరు ఉంది. కష్టాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తుండడంతో వీరి పట్ల అందరిలో గౌరవ మర్యాదలు ఉండేవి. అయితే ఎవరికీ తెలీని చీకటి కోణం.. ఈ దంపతుల్లో ఉందని తర్వాత తెలిసింది. పగటి పూట తమ పనులు తాము చేసుకుంటూనే.. రాత్రయిందంటే చాలు తమ అసలు స్వరూపం బయటపెట్టేవారు.


బైక్‌పై ఇద్దరూ నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దకు వెళ్లేవారు. గుట్టుచప్పుడు కాకుండా అక్కడ ఏర్పాటు చేసిన బ్యాటరీలను ఎత్తుకెళ్లేవారు. అనంతరం వాటిని డీలర్లకు అందించడం ద్వారా.. ఒక్కో బ్యాటరీకి సుమారు రూ.2,000లు అందేవి. ఇలా దాదాపు 230 బ్యాటరీలను చోరీ చేశారు. చోరీ చేసే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పోలీసులు గుర్తించలేకపోయేవారు. బ్యాటరీల దొంగల కోసం శతవిధాలా ప్రయత్నించేవారు. ఈ క్రమంలో ఓ సిగ్నల్ వద్ద సీసీ కెమెరాలో దంపతులిద్దరూ స్కూటీపై వెళ్తున్నట్లు గుర్తించారు. అయితే స్కూటీ నంబర్ కనపడకుండా చేయడంతో.. ఆర్టీవోను సంప్రదించి అలాంటి వాహనాల యజమానులందరినీ పిలిపించి విచారించారు. ఎట్టకేలకు నిందితులను ఫిబ్రవరి 9 అరెస్ట్ చేయగలిగారు. ఈ వార్త స్థానికంగా సంచలనం కలిగించింది.

No comments:

Post a Comment

Post Top Ad