Paytm Free Cylinder: పేటీఎం యూజర్లకు ఫ్రీ సిలిండర్... ఇలా బుక్ చేయాలి - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Saturday, February 12, 2022

Paytm Free Cylinder: పేటీఎం యూజర్లకు ఫ్రీ సిలిండర్... ఇలా బుక్ చేయాలి

Paytm Free Cylinder: పేటీఎం యూజర్లకు ఫ్రీ సిలిండర్... ఇలా బుక్ చేయాలి

Paytm Free Cylinder Offer | మీరు పేటీఎం యూజరా? పేటీఎం యాప్ వాడుతున్నారా? అయితే మీరు ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందొచ్చు. పేటీఎంలో ఎల్‌పీజీ సిలిండర్ బుక్ (LPG Cylinder Booking) చేయడం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందే అవకాశం లభిస్తుంది. ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.

 Paytm Free Cylinder: పేటీఎం యూజర్లకు ఫ్రీ సిలిండర్... ఇలా బుక్ చేయాలి

1. మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలనుకుంటున్నారా? ఇప్పటివరకు ఏజెన్సీకి వెళ్లి గ్యాస్ సిలిండర్ బుక్ (Gas Cylinder Booking) చేసే అలవాటు ఉందా? పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం ద్వారా క్యాష్‌బ్యాక్ (Cashback) పొందొచ్చు. అంతేకాదు... ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఆఫర్ కూడా ప్రకటించింది పేటీఎం. 


2. ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ యూజర్లు పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడూ పేటీఎం భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటుంది. గతంలో వరుసగా మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందే అవకాశం కల్పించింది. మూడు నెలలకు కలిపి గరిష్టంగా రూ.2,700 క్యాష్‌బ్యాక్ అందించింది. ఇక అంతకుముందు మొదటిసారి సిలిండర్ బుక్ చేసేవారికి రూ.900 వరకు క్యాష్‌బ్యాక్ అందించింది. ఇప్పుడు మరో ఆఫర్ ప్రకటించింది. 


3. పేటీఎం యూజర్లు ఈ యాప్‌లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసి ఉచితంగా సిలిండర్ పొందొచ్చు. ఇందుకోసం పేటీఎం ఓ ప్రోమో కోడ్‌ను యాక్టివేట్ చేసింది. పేటీఎం యూజర్లు యాప్‌లో సిలిండర్ బుక్ చేసే సమయంలో పేమెంట్ పేజీలో FREEGAS ప్రోమో కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లక్కీ కస్టమర్లకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందే ఛాన్స్ లభిస్తుంది. 


4. ఇక దీంతో పాటు క్యాష్‌బ్యాక్ కూడా ప్రకటించింది పేటీఎం. పేమెంట్ చేసే సమయంలో FIRSTCYLINDER ప్రోమో కోడ్ అప్లై చేయాలి. రూ.30 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్, ఇండేన్ గ్యాస్ యూజర్లు ఈ ఆఫర్ పొందొచ్చు. ఇక పేటీఎం పోస్ట్‌పెయిడ్ కింద పేటీఎం నౌ పే లేటర్ ఆఫర్ కూడా ఉంది. కస్టమర్లు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. తర్వాతి నెలలో డబ్బులు చెల్లించొచ్చు. 


5. పేటీఎం యూజర్లు చాలా సింపుల్‌గా గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. వారికి పేటీఎం అకౌంట్ ఉంటే చాలు. Book a Cylinder పేరుతో ఈ సర్వీస్ అందిస్తోంది పేటీఎం. ప్రతీ నెలా లక్షలాది మంది పేటీఎం యూజర్లు ఈ యాప్ ద్వారానే గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తున్నారు. మీరు కూడా పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవండి.


6. పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి ముందుగా మీ పేటీఎం యాప్ ఓపెన్ చేయండి. మీ మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్‌లో లాగిన్ అవండి. హోమ్ స్క్రీన్‌లో Recharge and Pay Bills పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత 'Book a Cylinder' ఆప్షన్ పైన క్లిక్ చేయండి. Bharat Gas, HP Gas, Indane పేరుతో గ్యాస్ ప్రొవైడర్ పేర్లు ఉంటాయి. మీరు ఏ గ్యాస్ ప్రొవైడర్ కస్టమర్ అయితే ఆ పేరు సెలెక్ట్ చేయండి. బుకింగ్ టైప్‌లో మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. 


7. కన్స్యూమర్ నెంబర్, డీలర్ కోడ్ లోదా ఎల్‌పీజీ ఐడీ లేదా మొబైల్ నెంబర్‌లో ఏదైనా ఎంటర్ చేయొచ్చు. ఆ తర్వాత Proceed పైన క్లిక్ చేస్తే కస్టమర్ వివరాలు కనిపిస్తాయి. పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేస్తే గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది. పేమెంట్ చేసే సమయంలోనే ప్రోమో కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పేటీఎం యాప్‌లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రాసెస్ పూర్తైన తర్వాత దగ్గర్లోని గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుంది. 


No comments:

Post a Comment

Post Top Ad