మీ ఆధార్ కార్డు పనిచేయటం లేదు తెలుసా మీకు? Alert Invalid Aadhar card, What about your aadhar card? - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Thursday, January 20, 2022

మీ ఆధార్ కార్డు పనిచేయటం లేదు తెలుసా మీకు? Alert Invalid Aadhar card, What about your aadhar card?

మీ ఆధార్ కార్డు పనిచేయటం లేదు తెలుసా మీకు? Alert Invalid Aadhar card, What about your aadhar card?

మీ ఆధార్ కార్డు పనిచేయటం లేదు తెలుసా మీకు? Alert Invalid Aadhar card, What about your aadhar card?


ఓపెన్ మార్కెట్ నుంచి పొందే పీవీసీ ఆధార్ కార్డులు వాలిడ్ కాదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) తెలిపింది. బయట మార్కెట్ నుంచి పొందే ఈ కార్డులలో సెక్యూరిటీ ఫీచర్లు తక్కువగా ఉన్నందున్న ఈ కాఫీలను వాడొద్దని UIDAI సూచించింది.

ఓపెన్ మార్కెట్ నుంచి పొందే పీవీసీ ఆధార్ కార్డులు వాలిడ్ కాదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) తెలిపింది. బయట మార్కెట్ నుంచి పొందే ఈ కార్డులలో సెక్యూరిటీ ఫీచర్లు తక్కువగా ఉన్నందున్న ఈ కాఫీలను వాడొద్దని UIDAI సూచించింది. Aadhaar PVC Cardను ప్రజలు రూ.50(జీఎస్టీ, స్పీడ్ పోస్టు ఛార్జీలు కలుపుకుని) చెల్లించి యూఐడీఏఐ నుంచి పొందాలని తెలిపింది. ఓపెన్ మార్కెట్ నుంచి పొందే పీవీసీ కార్డు లేదా ప్లాస్టిక్ లేదా ఆధార్ స్మార్ట్ కార్డు ప్రింట్లు వాలిడ్ కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు యూఐడీఏఐ ఒక ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో ఆధార్ పీవీసీ కార్డును ఆర్డర్ పెట్టుకునే లింక్‌ను కూడా అందించింది. యూఐడీఏఐ ఈ ఆదేశాలతో కోట్లాది మంది ప్రజలు ఆధార్ కార్డులు ఇన్‌వాలిడ్ అయిపోయాయి. చాలా మంది ప్రజలు ఆధార్ పీవీసీ కార్డులను ఓపెన్ మార్కెట్ నుంచే పొందుతున్నారు.

ఆధార్ పీవీసీ కార్డు అంటే ఏమిటి?
పీవీసీ ఆధారిత ఆధార్ కార్డులో పలు సెక్యూరిటీ ఫీచర్లు, మీ ఫోటోగ్రాఫ్, డెమొగ్రాఫిక్ వివరాలతో పాటు డిజిటల్‌గా సిగ్నేచర్ చేసిన సెక్యూర్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ ఆధార్ పీవీసీ కార్డును స్పీడ్ పోస్టు ద్వారా మీరు ఉండే అడ్రస్‌కు పంపుతారు.

యూఐడీఏఐ వెబ్‌సైట్ ప్రకారం ఈ కార్డులో ఉంటే సెక్యూరిటీ ఫీచర్లు..
సెక్యూర్ క్యూఆర్ కోడ్
హోలోగ్రామ్
మైక్రో టెక్ట్స్
జారీ తేదీ, ప్రింట్ తేదీ
గిల్లోచే నమూనా

ఎంబాసిడ్ ఆధార్ లోగో


ఆధార్ పీవీసీ కార్డును ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి..?
యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఆధార్ పీవీసీ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏమింటంటే..
స్టెప్ 1... https://myaadhaar.uidai.gov.in/కు వెళ్లాలి
స్టెప్ 2... ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డుపై క్లిక్ చేయాలి.
స్టెప్ 3... మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌ను లేదా 28 అంకెల ఎన్‌రోల్‌మెంట్ ఐడీని నమోదు చేయాలి
సెక్యూరిటీ కోడ్ నమోదు చేసి, ఓటీపీని ఎంటర్ చేయాలి.
స్టెప్ 4.. టర్మ్స్ అండ్ కండీషన్లను ఓకే చేయాలి
స్టెప్ 5... ఓటీపీ వెరిఫికేషన్ కోసం ‘సబ్‌మిట్’ బటన్‌ను నొక్కాలి
స్టెప్ 6.. ఆ తర్వాత పేమెంట్‌పై క్లిక్ చేయాలి
ఇది డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా పేమెంట్లు చేసే పేమెంట్ గేట్‌వే పేజీకి వెళ్తుంది. మీకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకుని పేమెంట్ చేయాలి.

No comments:

Post a Comment

Post Top Ad