Chips Packet: చిప్స్ ప్యాకెట్లలో గ్యాస్ ఎందుకు నింపుతారో మీకు తెలుసా? అసలు ఏ గ్యాస్ నింపుతారో తెలుసా?.. - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Thursday, January 20, 2022

Chips Packet: చిప్స్ ప్యాకెట్లలో గ్యాస్ ఎందుకు నింపుతారో మీకు తెలుసా? అసలు ఏ గ్యాస్ నింపుతారో తెలుసా?..

Chips Packet: చిప్స్ ప్యాకెట్లలో గ్యాస్ ఎందుకు నింపుతారో మీకు తెలుసా? అసలు ఏ గ్యాస్ నింపుతారో తెలుసా?..

Chips Packet: దాదాపు అన్ని చిప్స్ ప్యాకెట్‌లలో గ్యాస్ ఉంటుంది. అందులో ఉండే చిప్స్ తక్కువే అయినా.. కవర్ నిండా..

 Chips Packet: చిప్స్ ప్యాకెట్లలో గ్యాస్ ఎందుకు నింపుతారో మీకు తెలుసా? అసలు ఏ గ్యాస్ నింపుతారో తెలుసా?..

దాదాపు అన్ని చిప్స్ ప్యాకెట్‌లలో గ్యాస్ ఉంటుంది. అందులో ఉండే చిప్స్ తక్కువే అయినా.. కవర్ నిండా గ్యాస్ ఎక్కువగా ఉంటుంది. అయితే, అందులో నింపే గ్యాస్ ఏంటి? అసలు గ్యాస్ ఎందుకు నింపుతారు? అని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే, దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


చాలా మంది చిప్స్ ప్యాకెట్లలో గ్యాస్ ఎందుకుంటుంది అంటే.. చిప్స్ విరిగిపోకుండా అని సమాధానం చెబుతారు. కానీ అది వాస్తవం కాదు. అసలు కారణం వేరే ఉందని నిపుణులు చెబుతున్నారు. చిప్స్ ప్యాకెట్లలో గ్యాస్ ఉంటుంది. అయితే, అందరూ అనుకునే గ్యాస్ మాత్రం కాదు. సైన్స్ ప్రకారం చిప్స్ ప్యాకెట్‌లో ఎయిర్ నింపడం వెనుక మరో సిద్ధాంతం ఉందట.


ఆక్సీజన్‌ను రియాక్టీవ్ వాయువుగా పరిణగిస్తారు. ఇది ఏదైనా కణంలో త్వరగా కరిగిపోతుంది. రియాక్టీవ్ ఆక్సీజన్ కారణంగా బ్యాక్టీరియా మొదలైన సూక్ష్మ జీవులు అభివృద్ధి చెందుతాయి. అందువల్ల మనం తినే ఆహార పదార్థాలు, డ్రింక్స్ ఓపెన్ ప్లేస్‌లలో ఉంచినట్లయితే అవి త్వరగా చెడిపోతాయి. అందుకే చిప్స్ ప్యాకెట్‌లో నైట్రోజన్ గ్యాస్ నింపుతారు. నైట్రోజన్ ఆక్సిజన్ కంటే తక్కువ రియాక్టివ్ వాయువు.


మరి నైట్రోజన్‌ను మాత్రమే ఎందుకు నింపుతారంటే.. దాని వెనుక ఒక ప్రత్యేక కారణం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. నైట్రోజన్ రంగు, రుచి, వాసన లేనిది. తక్కువ రియాక్టివ్‌గా ఉంటుంది. అందుకే చిప్స్ ప్యాకెట్‌లో నైట్రోజన్‌ గ్యాస్‌ను నింపుతారు. నైట్రోజన్ గ్యాస్ నింపిన చిప్స్ ప్యాకెట్లను రవాణా చేయడం కూడా చాలా సులభం. అలాగే, చిప్స్‌ ఎక్కువ కాలం క్రిస్పీగా ఉంటాయి.


మరి ఏ చిప్స్ ప్యాకెట్‌లో ఎంత గ్యాస్ ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈట్‌ట్రీట్ అనే వెబ్‌సైట్.. రూ.25 లోపు విక్రయించే స్నాక్స్ ప్యాకెట్లపై ఓ ప్రయోగం చేసింది. లే చిప్స్‌ ప్యాకెట్‌లో 85 శాతం వరకు నైట్రోజన్‌ నింపినట్లు గుర్తించారు. అంకుల్ చిప్స్ ప్యాకెట్‌లో 75 శాతం నైట్రోజన్ ఉంటుంది. అదే సమయంలో, బింగో మ్యాడ్ యాంగిల్స్ ప్యాకెట్ 75% నైట్రోజన్ వాయువుతో నిండి ఉంటుంది.

No comments:

Post a Comment

Post Top Ad