What is the importance of white house toilet? వైట్ హౌస్‌‌లోని టాయిలెట్ ఎందుకు వార్తల్లో నిలుస్తూ వస్తోందంటే.. - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Monday, February 14, 2022

What is the importance of white house toilet? వైట్ హౌస్‌‌లోని టాయిలెట్ ఎందుకు వార్తల్లో నిలుస్తూ వస్తోందంటే..

What is the importance of white house toilet? వైట్ హౌస్‌‌లోని టాయిలెట్ ఎందుకు వార్తల్లో నిలుస్తూ వస్తోందంటే..

 What is the importance of white house toilet? వైట్ హౌస్‌‌లోని టాయిలెట్ ఎందుకు వార్తల్లో నిలుస్తూ వస్తోందంటే..


అమెరికాలోని వైట్ హౌస్‌తో పాటు యూఎస్ అధ్యక్షుని గొప్పతనం గురించి అప్పుడప్పుడూ వింటుంటాం. అయితే ఇప్పుడు వైట్ హౌస్ విచిత్రమైన వార్తల్లో నిలిచింది. వైట్ హౌస్‌లోని టాయిలెట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.  వైట్ హౌస్‌లోని టాయిలెట్‌ విలాసవంతంగా ఉన్న కారణంగా వార్తల్లో నిలిచిందనుకుంటే పప్పులో కాలేసినట్లే. దీనికి విరుర్దమైన వార్తల కారణంగా వైట్ హౌస్ టాయిలెట్ వార్తల్లో నిలిచింది. దీనికి కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఉదంతం అంతర్జాతీయ మీడియాలో ముఖ్యాంశంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కొన్ని కీలక పత్రాలను చించివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ చాలా పేపర్లను ఫ్లష్ చేసిన కారణంగా వైట్ హౌస్ టాయిలెట్ మూసుకుపోయింది. 

అప్పటి నుంచి ట్రంప్‌ తీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఈ ఉదంతంపై ట్రంప్ స్పందన కూడా తెరపైకి వచ్చింది. ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. ఈ వాదనలను తప్పు అని స్పష్టం చేశారు. న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ మ్యాగీ హాబెర్‌మాన్ తన రాబోయే పుస్తకం 'కాన్ఫిడెన్స్ మ్యాన్'లో వైట్ హౌస్ గురించి చాలా విషయాలు వెల్లడించారు. పేపర్ల కారణంగా టాయిలెట్ మూసుకుపోయిందని వైట్ హౌస్ సిబ్బంది చెప్పారని, ఆ పేపర్లను ట్రంప్ ఫ్లష్ చేశారని నమ్ముతున్నట్లు ఈ పుస్తకంలో పేర్కొన్నారు. క్లీనింగ్‌ సమయంలో టాయిలెట్‌లో చాలా ప్రింటెడ్ పేపర్లు కనిపించాయి. ఈ నేపధ్యంలోనే ట్రంప్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. యూఎస్ఏ టుడే తెలిపిన వివరాల ప్రకారం వైట్ హౌస్ సిబ్బంది టాయిలెట్ పైపుల నుండి ప్రింటెడ్ పేపర్లను రావడాన్ని చాలాసార్లు కనుగొన్నారని పుస్తకంలో రచయిత పేర్కొన్నారు. పుస్తక రచయిత సీఎన్ఎన్ కార్యక్రమంలో దీని గురించి సమాచారం కూడా ఇచ్చారు. అప్పుడు ఈ పత్రాలు ఎవరివైనా కావచ్చు, లేదా ముఖ్యమైన పత్రాలు కావచ్చని కూడా చెప్పాడు. ఇలా చాలా సార్లు జరిగింది అని చెప్పాడు. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలాసార్లు ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారని పుస్తకంలో పేర్కొన్నారు. ట్రంప్ పలు అధికారిక పత్రాలను ఫ్లోరిడాకు పంపారని, ట్రంప్ అధ్యక్ష రికార్డులను కూడా ధ్వంసం చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక కూడా టాయిలెట్ కారణంగా వార్తల్లో నిలిచారు. ఇవాంకా తన భద్రతకు నియమితులైన సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి టాయిలెట్ సౌకర్యం కల్పించడానికి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 

No comments:

Post a Comment

Post Top Ad