Good News from Jio to users - జియో సిమ్ కార్డ్ వాడే వారికి గుడ్ న్యూస్.. ఒకేసారి 2 శుభవార్తలు! - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Monday, February 14, 2022

Good News from Jio to users - జియో సిమ్ కార్డ్ వాడే వారికి గుడ్ న్యూస్.. ఒకేసారి 2 శుభవార్తలు!

Good News from Jio to users - జియో సిమ్ కార్డ్ వాడే వారికి గుడ్ న్యూస్.. ఒకేసారి 2 శుభవార్తలు!

 Good News from Jio to users - జియో సిమ్ కార్డ్ వాడే వారికి గుడ్ న్యూస్.. ఒకేసారి 2 శుభవార్తలు!

రిలయన్స్ జియో కస్టమర్లకు శుభవార్త. జియో కంపెనీ తాజాగా కస్టమర్లక రెండు శుభవార్తలు అందించింది. రూ.499 ప్లాన్‌ను మళ్లీ తీసుకువచ్చింది. అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అన్‌లిమిటెడ్ ప్లాన్‌ గడువును పొడిగించింది.

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో వంటి టెలికం సంస్థలు కొన్ని రోజుల కిందట టారిఫ్ ధరలను పెంచాయి. అలాగే కొన్ని ప్లాన్లను తొలగించాయి. మరి కొన్ని ప్లాన్ల బెనిఫిట్స్‌ను తగ్గించేశాయి. దీని వల్ల కస్టమర్లపై ప్రభావం పడింది. అయితే ఇప్పుడు రిలయన్స్ జియో తన కస్టమర్లకు శుభవార్త అందించింది.

మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్న రిలయన్స్ జియో మళ్లీ తన పాపులర్ ప్లాన్ రూ.499‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా రీచార్జ్ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు. ఇంకా డిస్నీ, హాట్‌స్టార్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ మాత్రం 28 రోజులు ఉంది. జియో నుంచి జియోకి, అలాగే ఇతర నెట్‌వర్క్స్‌కు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఇంకా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. జియో ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా వస్తుంది.

అంతేకాకుండా రిలయన్స్ జియో తన కస్టమర్లకు మరో తీపికబురు కూడా అందించింది. పాపులర్ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది రూ.2545 ప్లాన్. ఏడాది పాటు వాలిడిటీ వస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ప్రతి రోజూ 1.5 జీబీ డేటా, అపరిమితి కాల్స్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. రిలయన్స్ జియో వెబ్‌సైట్, యాప్‌లో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. జనవరి 7 వరకు ఈ ప్లాన్ అందుబాటులో ఉండొచ్చు.

మరోవైపు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. గేమింగ్ కంపెనీ జూపీతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో జూపీ యాప్ ఇకపై జియో ప్లాట్‌ఫామ్స్‌పై కూడా కనిపించనుంది. అంటే జియో యూజర్లకు జూపీ యాప్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుందని చెప్పుకోవచ్చు.

కాగా జూపీ కంపెనీ ఇటీవలనే సిరీస్ బి ఫండింగ్ ద్వారా 102 మిలియన్ డాలర్ల నిధుల సమీకరించింది. నేపియన్ క్యాపిటల్, వెస్ట్‌క్యాప్ గ్రూప్, టొమాలెస్ బై క్యాపిటల్, ఏజే క్యాపిటల్, మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్ ఇండియా, ఓరియోస్ వెంచర్ పార్ట్‌నర్స్ వంటి సంస్థల నుంచి ఈ నిధులు సేకరించింది. దీంతో కంపెనీ వాల్యూయేషన్ 600 మిలియన్ డాలర్లకు ఎగసింది.

No comments:

Post a Comment

Post Top Ad