Summer Tips: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. వేసవిలో కూలర్ అవసరం లేదు.. - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Saturday, February 26, 2022

Summer Tips: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. వేసవిలో కూలర్ అవసరం లేదు..

Summer Tips: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. వేసవిలో కూలర్ అవసరం లేదు..

 Summer Tips: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. వేసవిలో కూలర్ అవసరం లేదు..

Summer Tips: వేసవి వచ్చేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎండలు ఇంకాస్త పెరిగాయంటే.. అందరూ కూలర్లు,ఏసీల వెంట పడతారు. కానీ ఇంట్లో కొన్ని రకాల మొక్కలు ఉంటే ఇవేమీ అవసరం లేదు. అవే ఇంటిని చల్లబరుస్తాయి.


Indoor Plants to cool house: ఎండాకాలంలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఇంట్లో చాలా ఉక్కపోతగా ఉంటుంది. చెమటలు ఎక్కువగా పడుతాయి. అలాంటప్పుడు అందరూ ఏసీలు, కూలర్లు వేసుకొని.. చల్లటి గాలి కింద సేదతీరుతారు. కానీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. అవే మన ఇంట్లో వేడి గాలిని చల్లబరుస్తాయి.  


Benjamin ficus:  బెంజమిన్ ఫైకస్ చల్లదనాన్నికలిగిస్తాయి. ఈ మొక్కలు ఇంటి లోపల ఎన్ని ఉంటే... అంత చల్లగా ఉంటుంది.  


Boston Fern: ఈ మొక్క బోస్టన్ ఫెర్న్. ఇది చెడు గాలిని శుభ్రపరుస్తుంది.   గాలిలో విష పూరిత వాయువులను తొలగించి మనకు మంచి గాలిని అందిస్తుంది.  ఈ మొక్కకు ఎండ తగలకుండా చూసుకోవాలి.  ఇది ఇంట్లో ఉక్కపోత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. 


Snake Plant: స్నేక్ ప్లాంట్ చూడటానికి పాములా ఉంటుంది. ఇందులో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేడి గాలిని బాగా పీల్చుకుంటుంది. కిటికీ దగ్గర  ఈ మొక్కలను ఉంచితే.. వాటి గుండా వచ్చే గాలి చల్లగా ఉంటుంది.


Bamboo Palm: ఇల్లు, ఆఫీసుల్లో బాంబూ పామ్ మొక్కలను అలంకారం కోసం పెడుతుంటారు. ఇది ఇంట్లో ఉంటే ఆ ఇల్లు మరింత అందంగా కనిపిస్తుంది.  దీనికి ఉండే పెద్ద పెద్ద ఆకులు చల్లదనాన్ని పెంచుతాయి. విష వాయువుల్ని పీల్చుకునే గుణం కూడా వీటికి ఉంటుంది.  


Aloe Vera: ఈ మొక్క గురించి దాదాపుగా అందరికీ తెలిసిందే. ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తారు. ఇందులో నీరు చాలా ఉంటుంది. ఇది కూడా గాలిలో వేడిని బాగా తగ్గిస్తుంది. 


Peace Lily: పీస్ లిల్లీ. ఈ మొక్క బాగా పెరిగితే ఆకులు పెద్దగా అవుతాయి. అప్పుడే ఇంట్లోని గాలిని చల్లబరుస్తుంది. ఎక్కువగా ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 


Spider Plant: దీని పేరు స్పైడర్ ప్లాంట్. ఎలా ఉంచినా హాయిగా పెరుగుతుంది. కచ్చితంగా ఇంట్లో వేడి తగ్గాలి అనుకునేవారు ఈ మొక్కను పెంచుకోవచ్చు. 


Rubber Plant: రబ్బర్ మొక్కకు పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. ఇది ఎక్కువ చల్లదనం ఇస్తుంది. ఈ మొక్క ఉండే నేల మరీ తడిగా, మరీ పొడిగా లేకుండా చూసుకోవాలి. తరచూ నీరు పోస్తుండాలి.


Pothos or Devils Ivy: ఇది పోథోస్ లేదా డెవిల్స్. దీని కోసం ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన అవసరం లేదు. దానంతట అదే పెరుగుతుంది. ఆకులు హృదయం ఆకారంలో ఉంటాయి. ఇది కూడా ఇంటిని చల్లబరుస్తుంది.


Areca Palm: ఇది అరెకా పామ్. చూడటానికి అందంగా ఉంటుంది. దీనికి కాస్త స్థలం ఎక్కువ కావాలి. చాలా మంది నేలలో దీన్ని పాతుతారు. కుండీల్లో ఉంచి ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇది కూడా చెడుగాలిని మంచిగా చేస్తుందని నాసా (NASA) పరిశోధనలో తేలింది.


Chinese Evergreen: ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. పేరు చైనీస్ ఎవెర్‌గ్రీన్. ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటూ చల్లదనాన్ని ఇస్తుంది. ఇంట్లో వేడిమి ఎక్కువగా అనిపిస్తే  ఈ మొక్కలను పెంరుకోవాలి. వేడి గాలులను పీల్చుకొని వాతావరణాన్ని చల్లబరుస్తుంది. 

No comments:

Post a Comment

Post Top Ad