How to Grow Hair on Bald Spot? బట్టతలపై వెంట్రుకలు రావడానికి ఈ చిట్కాలు బాగా పనిచేస్తాయి.. - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Saturday, February 26, 2022

How to Grow Hair on Bald Spot? బట్టతలపై వెంట్రుకలు రావడానికి ఈ చిట్కాలు బాగా పనిచేస్తాయి..

How to Grow Hair on Bald Spot? బట్టతలపై వెంట్రుకలు రావడానికి ఈ చిట్కాలు బాగా పనిచేస్తాయి..

How to Grow Hair on Bald Spot? బట్టతలపై వెంట్రుకలు రావడానికి ఈ చిట్కాలు బాగా పనిచేస్తాయి..
తీవ్రమైన ఒత్తిడి, పోషకాహార లోపం, నిద్రలేమి సమస్యతో చాలా మంది బట్టతల బారిన పడుతున్నారు. ఈ బట్టతలతో నలుగురిలోకి వెళ్లాలంటే తెగ ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అంతేకాదు.. బట్టతలతో బయటకు వెళ్లినప్పుడు నాలుగురూ మీ బట్టతలపైనే జోకులు వేస్తుంటారు. అయితే చిన్న సింపుల్ చిట్కాలా ద్వారా ఈ బట్టతల నుంచి బయటపడొచ్చు. అవేంటంటే..

అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా జుట్టుంటేనే అందం. జుట్టుతోనే ఆనందం. ఎందుకంటే ఒత్తైన జుట్టుతోనే మన అందం రెట్టింపు అవుతుంది కాబట్టి. కానీ ప్రస్తుత చాలా మంది బట్టతలతో బాధపడుతున్నారు. ఈ బట్టతల రావడానికి చాలా రీసన్స్ ఉన్నాయి. పోషకాహార లోపం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి వంటి అనేక సమస్యలతో ఈ బట్టతల వస్తుంటుంది. 

 హెయిర్ ఫాల్ సమస్య నుంచి గట్టెక్కించేందుకు కొన్ని సింపుల్ చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఇవి బట్టతలపై కొత్త వెంట్రుకలు మొలిచేలా చేస్తాయి. అంతేకాదు హెయిర్ ఫాల్ సమస్య కూడా మటుమాయం అవుతుంది. ఒత్తైన జుట్టు రావడానికి, బట్టతల నుంచి బయటపడేందుకు ఈ చిట్కాలు బాగా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 ఉల్లిపాయ: ఉల్లి పాయ జుట్టు ఆరోగ్యానికి కూడా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సల్ఫర్ జుట్టుకు Blood circulation మెరుగ్గా అయ్యేలా చేస్తుంది. అంతేకాదు ఇది బట్టతల సమస్యనుంచి బయటపడేస్తుంది. ఇందుకోసం.. అవసరమైన ఉల్లిపాయలను తీసుకుని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ నుంచి రసాన్ని వేరు చేసి ఇందులో కాస్త తేనే కలపాలి. దాన్ని తలకు అప్లై చేసి  కొద్ది సేపు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా, శిలీంద్రాలు చనిపోతాయి. ముఖ్యంగా నెత్తికి Blood circulation మెరుగ్గా జరుగుతుంది.

ఆముదం నూనె: బట్టతల, హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టడంలో ఆముదం నూనె బాగా పనిచేస్తుంది. అంతేకాదు ఈ నూనె మనకు మాయిశ్చరైజింగ్ ఏజెంట్ లా కూడా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆముదం నూనె కేవలం హెయిర్ ఫాల్ సమస్యేకాదు చర్మ సమస్యలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అయితే బట్టతల సమస్య నుంచి విముక్తి పొందాలంటే దీపం నూనెను వేలితో కొంచెం కొంచెం తీసుకుని తలకు పెట్టుకోవాలి. ఆ తర్వాత జుట్టును మంచిగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే పోషణ జుట్టు మూలాలకు కూడా అందుతుంది. దాంతో మీ జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది.

 కొబ్బరి నూనె:  కొబ్బరి నూనెను ప్రతి రోజూ వెంట్రుకలకు రాసుకున్నా ఎటువంటి సమస్య రాదు. ఈ కొబ్బరి నూనెతో జుట్టు మూలాలకు పోషణ బాగా అందుతుంది. కాగా నైట్ పడుకునే ముందు గోరువెచ్చటి లేదా నార్మల్ గా ఉన్నా కొబ్బరి నూనెను తలకు బాగా పట్టించాలి. ఆ తర్వాత ఒక పది లేదా 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. మరుసటి రోజు మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే జుట్టు గ్రోత్ బాగుంటుంది. కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి పెట్టుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. 

మెంతులు:  బట్టతల సమస్య నుంచి బయటపడటానికి మెంతులు ఎంతో సహాయపడతాయి. ఈ మెంతులను కాసేపు నీళ్లలో నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ ను తలకు అప్లై చేసి ఒక గంటపాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నీట్ గా జుట్టును క్లీన్ చేయాలి. 

నిమ్మకాయ: నిమ్మకాయలో దివ్య ఔషదగుణాలుంటాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నిమ్మకాయతో హెయిర్ ఫాల్, డాండ్రఫ్, డ్రై హెయిర్ వంటి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. బట్టతల మటుమాయం కావాలంటే మీరు తలకు రాసుకునే నూనెను కొద్దిగా తీసుకుని అందులో కాస్త నిమ్మరసం కలపండి. దాన్ని మీ వెంట్రుకలకు బాగా పట్టించండి. ఆ తర్వాత కాసేపు మంచిగా మర్దన చేసి కాసేపు జుట్టును అలాగే వదిలేసి ఆ తర్వాత హెయిర్ ను వాష్ చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. 

No comments:

Post a Comment

Post Top Ad