Smartphone Tips: స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందా? క్లీన్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవండి
Smartphone Tips | మీ స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్ ఫుల్ అయిందా? కొత్తగా ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేద్దామంటే స్పేస్ సరిపోవట్లేదా? ఈ సమస్య మీకే కాదు. స్మార్ట్‌ఫోన్ యూజర్లలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య ఇది. మరి స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్ (Smartphone Storage) క్లీన్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవండి.
Smartphone Tips: స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందా? క్లీన్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవండి |
1. ఒకప్పుడు 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్ (Smartphone) ఉంటే చాలనుకునేవారు. కానీ ఇప్పుడు 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్‌తో స్మార్ట్‌ఫోన్లు కొనేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. అంతేకాదు... కొన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్‌తో స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. ఇంత భారీ మొబైల్స్ కాకుండా కనీసం 6జీబీ+128జీబీ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఉన్న అవసరాలకు సరిపోతుంది.
2. మెమొరీ కార్డుతో స్టోరేజ్ (Phone Storage) పెంచుకునే వీలుంటుంది. అయితే స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేసినా స్టోరేజ్ సరిపోవట్లేదని యూజర్లు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇందుకు కారణం స్మార్ట్‌ఫోన్‌లో అవసరంలేని ఫైల్స్ ఎక్కువగా నిండిపోవడమే. స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ నిండిపోవడం ప్రతీ స్మార్ట్‌ఫోన్ యూజర్‌కు ఉండే సమస్యే.
3. ఇటీవల కాలంలో ఎక్కువగా యాప్స్ ఉపయోగించడం మామూలైపోయింది. ఎక్కువ యాప్స్ ఉంటే స్టోరేజ్ కూడా నిండిపోతుంది. ఈ యాప్స్ డిలిట్ చేసినా కొన్ని ఫైల్స్ అలాగే ఉంటాయి. అవసరం లేని యాప్స్ కూడా ఫోన్‌లో అలాగే ఉంటాయి. ఫోటోలు, వీడియోలతో కూడా స్టోరేజ్ ఫుల్ అవుతుంది. అప్పుడప్పుడు స్టోరేజ్ ఖాళీ చేయడం అవసరం. మరి స్టోరేజ్ ఎలా ఖాళీ చేయాలో తెలుసుకోండి.
4. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మెనూలో Manage apps and device ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత Manage పైన క్లిక్ చేయండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్స్ కనిపిస్తాయి. వాటిలో మీరు ఉపయోగించని యాప్స్‌ని సెలెక్ట్ చేయండి. Uninstall పైన క్లిక్ చేయండి.
5. మీరు ఉపయోగించని యాప్స్ అన్నీ ఒకేసారి డిలిట్ అయిపోతాయి. స్టోరేజ్ చాలావరకు ఖాళీ అవుతుంది. అయినా స్టోరేజ్ సరిపోకపోతే మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలను గూగుల్ ఫోటోస్‌లోకి, ముఖ్యమైన ఫైల్స్‌ని గూగుల్ డ్రైవ్‌లోకి అప్‌లోడ్ చేయొచ్చు. అయితే గూగుల్ ఒక అకౌంట్‌కు 15జీబీ స్టోరేజ్ మాత్రమే ఇస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
6. గూగుల్ ఫోటోస్, గూగుల్ డ్రైవ్‌లోకి ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్ నుంచి వాటిని డిలిట్ చేస్తే స్టోరేజ్ చాలావరకు ఖాళీ అవుతుంది. ఇన్ని చేసిన తర్వాత కూడా మీ స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్ సరిపోకపోతే... వాట్సప్‌లో అవసరం లేని ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయాలి.
7. మీ స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యమైన ఫైల్స్ అన్నీ బ్యాకప్ పెట్టి ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. ఫ్యాక్టరీ రీసెట్ చేసేముందు ఫైల్స్ బ్యాకప్ చేయడం మర్చిపోవద్దు. ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత స్మార్ట్‌ఫోన్ కొత్త మొబైల్‌లా ఆన్ అవుతుంది. మీరు బ్యాకప్ పెట్టిన ఫైల్స్‌లో ముఖ్యమైన వాటినే స్మార్ట్‌ఫోన్‌లోకి కాపీ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
No comments:
Post a Comment