Amazon Bumber Offer 50 percent discount: అమెజాన్‌ బంపరాఫర్‌..! ప్రైమ్‌ సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు..! ఈ ఆఫర్‌ వారికి మాత్రమే..! - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Sunday, February 13, 2022

Amazon Bumber Offer 50 percent discount: అమెజాన్‌ బంపరాఫర్‌..! ప్రైమ్‌ సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు..! ఈ ఆఫర్‌ వారికి మాత్రమే..!

Amazon Bumber Offer 50 percent discount: అమెజాన్‌ బంపరాఫర్‌..! ప్రైమ్‌ సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు..! ఈ ఆఫర్‌ వారికి మాత్రమే..!

 Amazon Bumber Offer 50 percent discount: అమెజాన్‌ బంపరాఫర్‌..! ప్రైమ్‌ సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు..! ఈ ఆఫర్‌ వారికి మాత్రమే..!

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ బంపరాఫర్‌ను ప్రకటించింది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌పై ఏకంగా 50 శాతం తగ్గింపును అందించనుంది. ఈ ఆఫర్‌ కేవలం 18-24 ఏళ్లలోపు యువకులకు వర్తించనుంది. దాంతోపాటుగా వారు పాత కస్టమర్లై ఉండాలి. 


యువతే లక్ష్యంగా..!

గత ఏడాది ప్రైమ్‌ సేవల ధరలను పెంచుతూ అమెజాన్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. యువతను లక్ష్యంగా చేసుకొని​ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌పై రెఫరల్స్ ప్రోగ్రామ్‌ను అమెజాన్‌ ప్రారంభించింది. ఈ ‘యూత్ ఆఫర్’ రెఫరల్స్‌ ప్రోగ్రాంలో భాగంగా సదరు యూజరు ప్రైమ్‌లో చేరినట్లయితే సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు రానుంది. 


► యూత్‌ ఆఫర్‌లో భాగంగా అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ నెలవారీ రూ. 179 సభ్యత్వంపై  రూ. 90 క్యాష్‌బ్యాక్‌తో పాటు మరో రూ. 18 క్యాష్‌బ్యాక్‌ను రిఫరల్ రివార్డ్‌గా ఆయా యూజర్‌ పొందవచ్చు.


► త్రైమాసిక సభ్యత్వంపై రూ. 479 సభ్యత్వంపై  రూ. 230 క్యాష్‌బ్యాక్‌తో పాటు మరో రూ. 46 క్యాష్‌బ్యాక్‌ను రిఫరల్ రివార్డ్‌గా ఆయా యూజర్‌ పొందవచ్చు.


► వార్షిక సభ్యత్వంపై రూ. 1,499పై ఆయా యూజర్‌ రూ. 750 క్యాష్‌బ్యాక్‌తో పాటుగా మరో వ్యక్తికి రెఫరల్‌ చేసినందుకుగాను మరో రూ. 150 క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్‌ అందిస్తోంది. 


అమెజాన్‌ అందిస్తోన్న యూత్‌ ఆఫర్‌ను సదరు వ్యక్తి ఆయా యూజర్‌కు రెఫరల్‌ చేయడంతో 50 శాతం తగ్గింపును పొందవచ్చును. సదరు యూజర్‌ ఖచ్చితంగా తన వయసును నిర్థారించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం సెల్ఫీ, తదితర వయసు ధృవీకరణ పత్రాలను సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ ‘అమెజాన్‌ పే’లో క్రెడిట్‌ అవుతుంది. 

No comments:

Post a Comment

Post Top Ad