SBI అకౌంట్ ఉందా! అయితే, ఈ అలర్ట్ మీ కోసమే..! - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Tuesday, January 18, 2022

SBI అకౌంట్ ఉందా! అయితే, ఈ అలర్ట్ మీ కోసమే..!

 SBI అకౌంట్ ఉందా! అయితే, ఈ అలర్ట్ మీ కోసమే..!

 SBI అకౌంట్ ఉందా! అయితే, ఈ అలర్ట్ మీ కోసమే..!

SBI తన కస్టమర్లకు మరొకసారి అలర్ట్ జారీచేసింది

పాన్ మరియు ఆధార్ కార్డ్‌ లను లింక్ చేయాలని తన ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది

చాలా సింపుల్ గా మీ పాన్- ఆధార్ లింక్ చెయ్యవచ్చు


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు మరొకసారి అలర్ట్ జారీచేసింది. 31 మార్చి 2022 లోపు SBI బ్యాంక్ అకౌంట్ కలిగిన ప్రతిఒక్కరూ కూడా వారి పాన్ మరియు ఆధార్ కార్డ్‌ లను లింక్ చేయాలని తన ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. అలా చేయని ఖాతాదారుల అకౌంట్ యొక్క అన్ని సర్వీసులు నిలిచిపోతాయని కూడా పేర్కొంది. ఈ ప్రకటన గురించి SBI తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ట్వీట్ ద్వారా తెలియచేసింది. ఎటువంటి అంతరాయం లేని సర్వీస్ లను పొందాలంటే, 31 మార్చి 2022 లోపు SBI బ్యాంక్ అకౌంట్ కలిగిన ప్రతిఒక్కరూ కూడా వారి పాన్ మరియు ఆధార్ కార్డ్‌ లను లింక్ చేయాలని తెలిపింది. అంతేకాదు, ఖాతాదారులకు వారి సర్వీసులలో అంతరాయం కలుగకుండా చూసేందుకు గాను, పాన్- ఆధార్ లింక్ కోసం  ముందుగా విధించిన 30 సెప్టెంబర్ 2021 గడువును ఇప్పుడు 31 మార్చి 2022 వరకు మార్చిన విషయాన్ని కూడా గుర్తుచేసింది.


వాస్తవానికి, పాన్- ఆధార్ లింక్ అంత కష్టమైన పని కూడా కాదు. చాలా సింపుల్ గా మీ పాన్- ఆధార్ లింక్ చెయ్యవచ్చు. ఒకవేళ ఇప్పటి వరకు మీ పాన్- ఆధార్ లింక్ చేయకుంటే, ఈ క్రింద అందించిన విధంగా చెయవచ్చు. ఆధార్‌తో పాన్ లింక్ముందుగా https://www.incometax.gov.in/iec/foportal పేజ్ ఓపెన్ చేయండి ఇక్కడ  ఎడమవైపున ఉన్న 'Link Aadhaar' పైన నొక్కండి ఇప్పుడు మీరు కొత్త పేజ్ కు మళ్ళించబడతారు ఇక్కడ మీ PAN నంబర్ ఆధార్ నంబర్ మరియు మొబైల్ నంబర్ వివరాలను అందించాలి తరువాత మీ ఆధార్ కార్డ్ లో పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే, I have only year of birth in aadhaar card అనే బాక్స్ లో టిక్ చేయండి తరువాత క్యాప్చ కోడ్ ద్వారా OTP అందుకుంటారు మీ OTP ఎంటర్ చేయాలి ఇప్పుడు Link Aadhaar బటన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా మీ పాన్-ఆధార్ ను Income Tax అధికారిక వెబ్సైట్ ద్వారా లింక్ చేయవచ్చు. అలాగే, మీ పాన్-ఆధార్ ను SMS ను పంపడం ద్వారా కూడా లింక్ చేయవచ్చు. దానికి కోసం ఈ క్రింద అందించిన విధంగా చేయండి. మీ మొబైల్ నంబర్ నుండి మీరు UIDPAN<12 అంకెల ఆధార్ నంబర్ <10 అంకెల PAN నంబర్> ని టైప్ చేయాలి. ఈ సందేశాన్ని 567678 లేదా 56161కి పంపండి. అంతే మా పాన్ ఆధార్ లింక్ కోసం అభ్యర్ధన అందించినట్లే.

No comments:

Post a Comment

Post Top Ad