Post office : రోజూ రూ.200 డిపాజిట్ చేయడం ద్వారా రూ.9.75 లక్షలు పొందొచ్చు - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Thursday, January 27, 2022

Post office : రోజూ రూ.200 డిపాజిట్ చేయడం ద్వారా రూ.9.75 లక్షలు పొందొచ్చు

Post office : రోజూ రూ.200 డిపాజిట్ చేయడం ద్వారా రూ.9.75 లక్షలు పొందొచ్చు

 Post office : రోజూ రూ.200 డిపాజిట్ చేయడం ద్వారా రూ.9.75 లక్షలు పొందొచ్చు

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు కొన్నేళ్లలోనే లక్షాధికారులు అయిపోవచ్చు. ఆకర్షణీయమైన రిటర్నులను ఈ స్కీమ్ అందిస్తోంది. ఈ రికరింగ్ డిపాజిట్లకు పోస్టాఫీసు 5.8 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది.


మీరు తల్లిదండ్రులయ్యాక తొలుత ఆలోచించాల్సిందే మీ పిల్లల భవిష్యత్ గురించే. వారి భవిష్యత్ కోసం ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకుంటే మంచిది. పిల్లల చదువులు ప్రతి రోజూ కొంత మొత్తాన్ని పోస్టాఫీసు స్కీమ్స్‌లో డిపాజిట్ చేస్తే.. మీరు లక్షలు సంపాదించవచ్చు. అలాంటి స్కీమ్‌లలో ఒకటే... పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్. ఈ స్కీమ్‌లో మీ పిల్లల కోసం ప్రతి రోజూ రూ.200 డిపాజిట్ చేయడం ద్వారా ఐదేళ్లలోనే మీ పిల్లలు లక్షాధికారులు అయిపోవచ్చు. మీ పిల్లల కోసమే కాదు కారు కొనేందుకు లేదా మరే ఇతర అవసరం కోసమైనా ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. మీ పిల్లలకు లీగల్ గార్డియన్‌గా ఈ పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ను తెరవవచ్చు.


ఐదేళ్లకు మీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ మెచ్యూర్ అవుతుంది. ఈ పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌లో ప్రతి నెలా కనీసం రూ.100ను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంత మొత్తంలోనైనా ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. మీ పిల్లల కోసమే కాకుండా.. మీరు కూడా జాయింట్‌గా, సింగిల్‌గా ఈ అకౌంట్‌ను తెరవవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని ఆర్‌డీ అకౌంట్లైనా తెరవవచ్చు. చిన్న మొత్తాలకు కూడా ఈ ఆర్‌డీ డిపాజిట్ స్కీమ్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంది.


ఇది ప్రభుత్వ గ్యారెంటీ పథకం. నెలలో ఒకటో తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎప్పుడైనా ఈ అకౌంట్‌ను తెరవవచ్చు. ఈ మధ్యలో అకౌంట్ ఓపెన్ చేస్తే.. ప్రతి నెలా 15వ తేదీ కంటే ముందే మనీని డిపాజిట్ చేయాలి. ఈ పోస్టాఫీసు స్కీమ్‌కి 5.8 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటు సమీక్ష ఉంటుంది. ప్రస్తుతం మార్చి 31 వరకు ఈ వడ్డీ రేట్లు మారవు. ఏప్రిల్ 1న కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి.


రోజూ 200తో రూ.9.75 లక్షలు ఎలా వస్తాయి..?

ఈ స్కీమ్‌లో ప్రతి రోజూ రూ.200ను డిపాజిట్ చేస్తే.. నెలకు రూ.6000 డిపాజిట్ చేసినట్టవుతుంది. ఈ మొత్తంపై లభించే 5.8 శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీ సమయానికి ఈ మొత్తం రూ.4.18 లక్షలవుతాయి. మరో ఐదేళ్ల పాటు ఈ ఆర్‌డీ స్కీమ్‌ను పొడిగించుకుని, ప్రతి నెలా రూ.6 వేల ఇన్వెస్ట్ చేస్తే.. మీకు మెచ్యూరిటీ సమయానికి రూ.9.75 లక్షలవుతాయి. ఈ స్కీమ్‌కి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

No comments:

Post a Comment

Post Top Ad