Covishield, Covaxin : వ్యాక్సిన్ వేయించుకునే వారికి గుడ్‌న్యూస్! - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Thursday, January 27, 2022

Covishield, Covaxin : వ్యాక్సిన్ వేయించుకునే వారికి గుడ్‌న్యూస్!

Covishield, Covaxin : వ్యాక్సిన్ వేయించుకునే వారికి గుడ్‌న్యూస్!

 Covishield, Covaxin : వ్యాక్సిన్ వేయించుకునే వారికి గుడ్‌న్యూస్!

కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వేయించుకునే వారికి గుడ్ న్యూస్. ఈ కరోనా వ్యాక్సిన్ల రేట్లు త్వరలోనే తగ్గనున్నాయి. రెగ్యులర్ మార్కెట్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ టీకాల ఒక్కో డోసు ధర రూ.275గా నిర్ణయించనున్నారు. వీటికి అదనంగా రూ.150 సర్వీసు ఛార్జీలు విధించనున్నారు.


కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వేయించుకునే వారికి గుడ్ న్యూస్. ఈ కరోనా వ్యాక్సిన్ల రేట్లు త్వరలోనే తగ్గనున్నాయి. భారత డ్రగ్ రెగ్యులేటరీ నుంచి రెగ్యులర్ మార్కెట్ అప్రూవల్ త్వరలోనే వస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. రెగ్యులర్ మార్కెట్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ టీకాల ఒక్కో డోసు ధర రూ.275గా నిర్ణయించనున్నారు. వీటికి అదనంగా రూ.150 సర్వీసు ఛార్జీలు విధించనున్నారు.


టీకాలను సరసమైన ధరలలో అందుబాటులోకి తెచ్చేందుకు ధరలను తగ్గించే పనిని ప్రారంభించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్‌పీపీఏ)కి ఆదేశాలు జారీ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం కోవాగ్జిన్ ఒక్కో డోసు ధర ప్రైవేట్ ఆసుపత్రులలో రూ.1200గా ఉంది. అదేవిధంగా కోవిషీల్డ్ ధర రూ.780 పలుకుతోంది. ఈ ధరలలోనే సర్వీసు ఛార్జీలు రూ.150 కలిసి ఉన్నాయి. దేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం టీకాకరణ కార్యక్రమాన్ని వేగంగా చేపడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకాకరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.


తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు రెగ్యులర్ మార్కెట్ అప్రూవల్ కోరుతూ సిరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్(ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల) ప్రకాశ్ కుమార్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు పెట్టుకున్నారు. అదేవిధంగా కొన్ని వారాల క్రితమే భారత్ బయోటెక్ హోల్ టైమ్ డైరెక్టర్ వీ కృష్ణ మోహన్ కూడా కోవాగ్జిన్‌కు సంబంధించిన ప్రీ క్లినికల్ డేటా, క్లినికల్ డేటాతో పాటు వాటి కెమిస్ట్రీ, తయారీ, కంట్రోల్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సమర్పించారు. ఈ డేటాను సమర్పిస్తూ కోవాగ్జిన్‌కు రెగ్యులర్ మార్కెట్ అథరైజేషన్‌ను కోరారు.

No comments:

Post a Comment

Post Top Ad