Good News to Farmers from SBI Bank - ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న రైతులకు శుభవార్త.. రూ.3 లక్షలు పొందండిలా..!
Good News to Farmers from SBI Bank - ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న రైతులకు శుభవార్త.. రూ.3 లక్షలు పొందండిలా..! |
భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రైతులకు ఎల్లవేళలా అండగా నిలుస్తుంటాయి.బ్యాంకింగ్ సంస్థలు పలు పథకాల ద్వారా రైతులకు అతి తక్కువ వడ్డీ రేట్లకే రుణాలను అంద జేస్తుంటాయి.
అయితే ప్రస్తుతం విత్తనాలు, మందులు, కూలీ, ప్యాకేజింగ్ వంటి ఇతరత్రా ధరలు పెరిగిపోవడంతో రైతులు సత మత మవుతున్నారు.ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ బ్యాంకు రైతులకు శుభవార్త అందించింది.
ఎస్‌బీఐలో అకౌంట్ ఉన్న అన్నదాతలందరూ కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకొని రుణాలు పొందొచ్చని స్టేట్ బ్యాంకు వెల్లడించింది.రైతులు ఈ కార్డు కోసం యోనో యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు.
యోనో యాప్‌లో సైన్ అప్ చేసిన తర్వాత రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు ఉపయోగించి రుణం కోసం దరఖాస్తు పెట్టు కోవచ్చు.కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులు గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు రుణం పొందొచ్చు.ఈ రుణంపై వడ్డీ రేటు 9 శాతంగా ఉన్నప్పటికీ… ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ వల్ల ఈ వడ్డీ రేటు చాలా వరకు తగ్గుతుంది.
ఈ రుణాలపై కేంద్రం 2 శాతం రాయితీని రైతులకు ఆఫర్ చేస్తుంది.ఫలితంగా వడ్డీ రేటు 7 శాతానికి తగ్గుతుంది.మీరు సకాలంలో లోన్ చెల్లిస్తే.వడ్డీ రేటు మళ్లీ 3 శాతం దిగివస్తుంది.
అప్పుడు ఈ రుణంపై కేవలం 4 శాతం వడ్డీ కడితే సరిపోతుంది.ఇది చాలా తక్కువ వడ్డీ అని చెప్పవచ్చు.
రుణం తీసుకోవాలనుకునే రైతులు యోనో యాప్ వాడేందుకు ముందుగా నెట్ బ్యాంకింగ్ కు యాక్సెస్ కలిగి ఉండాలి.తర్వాత యోనో యాప్‌లోకి లాగిన్ అయి యోనో కృషి (YONO Krishi) అనే ఆప్షన్‌పై నొక్కండి.ఇప్పుడు ఒక కొత్త విండో ఓపెన్ అవ్వడం మీరు చూడొచ్చు.ఈ విండోలో మీరు ఖాటా (Khata) అనే ఆప్షన్‌పై నొక్కితే అగ్రి గోల్డ్ లోన్, కిసాన్ క్రెడిట్ కార్డు వంటి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.
కిసాన్ క్రెడిట్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన మీ వివరాలను అందించండి.అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పొలం పట్టా వంటి డాక్యుమెంట్లు మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది.
కిసాన్ క్రెడిట్ కార్డు వచ్చాక మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ రుణాన్ని సకాలంలో చెల్లించి వడ్డీ రేటును సగానికిపైగా తగ్గించుకోవచ్చు.
No comments:
Post a Comment