TS RTC : కోడిపుంజుకు టికెట్.... ఏం జరిగిందో చెప్పిన ఎండీ సజ్జనార్... కండక్టర్‌పై చర్యలు..
TS RTC : తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణికునికి ఓ వింత సంఘటన ఎదురైన విషయం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.. బస్సులో ప్రయాణికుడితో పాటు కోడికి కూడా కండక్టర్ టికెట్ కొట్టిన అంశంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించా
TS RTC : కోడిపుంజుకు టికెట్.... ఏం జరిగిందో చెప్పిన ఎండీ సజ్జనార్... కండక్టర్‌పై చర్యలు.. |
మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గోదావరి ఖని డిపో నుండి కరీంనగర్ పట్టణానికి బయలుదేరిన బస్సులో మహ్మద్ ఆలీ అనే ప్రయాణికుడు ఎక్కాడు. అయితే ఆలీ తనతో పాటు ఓ కోడిపుంజును కూడా తనతో పాటు తీసుకుని వచ్చాడు.. కోడిని ఎవరికి కనబడకుండా ఓ సంచిలో మూటగట్టి పెట్టాడు..అయితే బస్సు సుల్తానాబాద్‌కు చేరుకోగానే..బస్సు కుదుపులకు కోడి ఒక్కసారిగా అరిచిందని,దీంతో కోడికి సైతం ఫుల్ టికెట్ కండక్టర్ ఇచ్చాడు..ఇదేంటని అడిగితే కండక్టర్ ఇలా సమాధానం చెప్పాడు. ప్రయాణికుడితో పాటు ప్రాణం ఉన్న ఏ జీవి బస్సులో ప్రయాణించినా టికెట్ తీసుకోవాలని ఆదేశాలు ఉన్నట్టు వివరించాడు బస్సు కండక్టర్. సో దీంతో కండక్టర్ ఇదే విషయం మీడియాకు సైతం వివరించడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
అయితే ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.. అసలు ఎం జరిగింది. కండక్టర్ ఎందుకు టికెట్ కొట్టాల్సి వచ్చిందో వివరించారు.వాస్తవానికి బస్సల్లో పశువులకు అనుమతి లేదు. కాని బస్సులో కోడితో ప్రయాణిస్తున్న ప్రయాణికునితో ఉన్న కోడిపుంజును సుల్తాన్‌బాద్ దగ్గర కండక్టర్ గుర్తించిన తర్వాత ఆ ప్రయాణికుడ్నికండక్టర్ ప్రశ్నించాడు. అయితే అదే బస్సులో ఉన్న శ్రీ కుమార్ అనే ఓ న్యూస్ రిపోర్టర్.. కండక్టర్‌ను టికెట్ కొట్టమని వుసిగొల్పాడని తెలిపాడు..ఉద్దేశ్యపూర్వకంగానే హాట్ న్యూస్ కోసం ఆ రిపోర్టర్ అలా ప్రోత్సహించడంతో బస్సు కండక్టర్ ఆ రిపోర్టర్ ప్రభావంతో కోడిపుంజుకు ఫుల్ టికెట్ కొట్టాడు.అయితే బస్సులో ఉన్న కండక్టర్ ఆ రిపోర్టర్ చెప్పినట్లు.. అలా ప్రవర్తించాల్సింది కాదని వివరించాడు..ఏది ఏమైనా బస్సు కండక్టర్ మీద చర్యలు తీసుకుంటామని సజ్జనార్ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ చేశారు.
@tsrtcmdoffice idi correct anatara pic.twitter.com/bXabT9JYSV
— Vinod Kumar Yella (@vnodkanna) February 8, 2022
అయితే ఆర్టీసీ ఇటివల మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ ఓ ఆఫర్ ప్రకటించింది. బస్సులో కోళ్లు, మేకలు సైతం తీసుకుని వెళ్లవచ్చంటూ అనుమతి ఇచ్చింది. మరి అప్పుడు వాటికి కూడా టికెట్స్ ఇస్తారా లేదా ఉచితంగానే అనుమతిస్తారా అనేది వేచి చూడాలి.
No comments:
Post a Comment