Paytm CashBack: మీ మొబైల్‌లో పేటీఎమ్‌ ఉందా..? నాలుగు రూపాయలు పంపించి, రూ. 100 పొందండి.. - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Sunday, February 13, 2022

Paytm CashBack: మీ మొబైల్‌లో పేటీఎమ్‌ ఉందా..? నాలుగు రూపాయలు పంపించి, రూ. 100 పొందండి..

Paytm CashBack: మీ మొబైల్‌లో పేటీఎమ్‌ ఉందా..? నాలుగు రూపాయలు పంపించి, రూ. 100 పొందండి..

Paytm CashBack: ప్రస్తుతం అంతా యూపీఐ పేమెంట్స్‌దే హవా. రూ. 10 నుంచి రూ. వేల వరకు అంతా మొబైల్‌ ద్వారానే పేమెంట్స్‌ చేసేస్తున్నారు. యూపీఐ పేమెంట్ సేవలు అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో కేవలం కొన్ని సంస్థలు..

 Paytm CashBack: మీ మొబైల్‌లో పేటీఎమ్‌ ఉందా..? నాలుగు రూపాయలు పంపించి, రూ. 100 పొందండి..

Paytm CashBack: ప్రస్తుతం అంతా యూపీఐ పేమెంట్స్‌దే హవా. రూ. 10 నుంచి రూ. వేల వరకు అంతా మొబైల్‌ ద్వారానే పేమెంట్స్‌ చేసేస్తున్నారు. యూపీఐ పేమెంట్ సేవలు అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో కేవలం కొన్ని సంస్థలు మాత్రమే ఈ సేవలను అందించాయి. అయితే యూజర్లు పెద్ద ఎత్తున ఈ సేవలను వినియోగించడంతో ఈ సంస్థల మధ్య కూడా పోటీ తత్త్వం పెరిగింది. దీంతో రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ యూజర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ పేమెంట్‌ యాప్‌ వినియోగదారుల కోసం ఓ బంపరాఫర్‌ను తీసుకొచ్చింది.


తమ యాప్‌ నుంచి డబ్బులను ట్రాన్స్‌ఫర్‌ చేసే యూజర్ల కోసం ‘4 కా 100 క్యాష్‌బ్యాక్’ పేరుతో ఓ ఆఫర్‌ను తీసుకొచ్చింది పేటీఎమ్‌. ఇండియా వర్సెస్‌ వెస్ట్‌ ఇండిస్‌ వన్డే, టీ20 సిరీస్‌ జరుగుతున్నని రోజులు కస్టమర్లు పేటీఎం యూపీఐ ద్వారా నాలుగు రూపాయలు బదిలి చేస్తే, రూ. 100 క్యాష్‌ బ్యాక్‌ పొందే అవకాశం ఇచ్చింది. అయితే పేటీఎం ఈ ఆఫర్‌ను కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.


అంతేకాకుండా రిఫరల్‌ ప్రోగ్రామ్‌ పేరుతో అదనపు క్యాష్‌ బ్యాక్‌ను కూడా అందిస్తోంది. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులను పేటీఎం యూపీఐ పేమెంట్స్‌ కోసం ఆహ్వానిస్తూ రిఫరల్‌ కోడ్‌ పంపిస్తే రూ. 100 క్యాష్‌బ్యాక్‌ కూడా ఇవ్వనుంది. ఈ ఆఫర్‌ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 20 వరకు అందుబాటులో ఉండనుంది. మరెందుకు ఆలస్యం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌పొందే ఛాన్స్‌ను మీరూ కొట్టేయండి.a

No comments:

Post a Comment

Post Top Ad