Jio Free Plans Disney Plus Hotstar: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. ఏడాదిపాటు డిస్నీ+ హాట్‌స్టార్ సేవలు ఉచితం
Jio Free Plans Disney Plus Hotstar: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. ఏడాదిపాటు డిస్నీ+ హాట్‌స్టార్ సేవలు ఉచితం |
రిలయన్స్ జియో సంస్థ వినియోగదారుల కోసం మరో రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. రూ. 1,499, రూ. 4,199తో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు రూ. 1,499 విలువ కలిగిన డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాదిపాటు ఉచితంగా అందివ్వనున్నట్లు వెల్లడించింది. దీంతో జియో యూజర్లు డిస్నీ+ హాట్‌స్టార్‌లోని 4K క్వాలిటీ కంటెంట్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌లలో వీక్షించవచ్చు. అంతేకాకుండా ఈ రీఛార్జ్ ప్లాన్‌తో హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ ఎస్సెమ్మెస్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
* రూ. 1,499 విలువైన రీఛార్జ్ కాలపరిమితి 84 రోజులు. ఇందులో ప్రతిరోజూ 2జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు, ఏడాదిపాటు డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ యూజర్లు పొందుతారు.
* రూ. 4,999 రీఛార్జ్ కాలపరిమితి 365 రోజులు. ఈ రీఛార్జ్‌తో యూజర్‌క ప్రతి రోజూ 3జీబీ హై-స్పీడ్ డేటాతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు, ఏడాదిపాటు డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం లభిస్తుంది. వీటితోపాటు రెండు రీఛార్జ్ ప్లాన్లలో అన్ని జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. * జియో యూజర్స్ మై జియో యాప్ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు. కొత్త ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్న తర్వాత మై జియో యాప్‌లో యూజర్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం ప్రత్యేక కూపన్ కోడ్ వస్తుంది. తర్వాత హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ వెబ్‌పేజ్‌లో కూపన్ కోడ్ ఎంటర్ చేసి యూజర్ ఫోన్ నంబరుతో సైన్ ఇన్ చేస్తే ఏడాదిపాటు డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో యూజర్ ఏడాదిపాటు 4K క్వాలిటీ కంటెంట్‌ను మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్‌లెట్స్, టీవీలలో ఏదైనా నాలుగు డివైజ్‌లలో ఒకేసారి చూడొచ్చు. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో లైవ్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ స్పెషల్స్, టీవీ సీరియల్స్, సినిమాలు, డిస్నీ+ సినిమాలు, డిస్నీ+ ఒరిజినల్స్ కంటెంట్‌ను వీక్షించవచ్చు.
No comments:
Post a Comment