Is your WhatsApp account safe? మీ వాట్సప్ అకౌంట్ సేఫ్‌గా ఉండాలా? ఈ 5 ఫీచర్స్ వాడుకోండి - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Saturday, February 26, 2022

Is your WhatsApp account safe? మీ వాట్సప్ అకౌంట్ సేఫ్‌గా ఉండాలా? ఈ 5 ఫీచర్స్ వాడుకోండి

Is your WhatsApp account safe? మీ వాట్సప్ అకౌంట్ సేఫ్‌గా ఉండాలా? ఈ 5 ఫీచర్స్ వాడుకోండి

WhatsApp Features | మీ వాట్సప్ అకౌంట్ సేఫ్‌గా ఉందని మీరనుకుంటున్నారా? వాట్సప్ అందించే సేఫ్టీ ఫీచర్స్ (WhatsApp Safety Features) వాడుకుంటే మీ అకౌంట్ సేఫ్‌గా ఉన్నట్టే. మీరు కూడా ఈ 5 ఫీచర్స్ వాడుకొని మీ వాట్సప్ అకౌంట్‌ని సేఫ్‌గా మార్చుకోండి.

Is your WhatsApp account safe? మీ వాట్సప్ అకౌంట్ సేఫ్‌గా ఉండాలా? ఈ 5 ఫీచర్స్ వాడుకోండి

1. మీరు వాట్సప్ యాప్ ఉపయోగిస్తున్నారా? కొత్తగా వాట్సప్ డౌన్‌లోడ్ (WhatsApp Download) చేశారా? మరి మీ వాట్సప్ అకౌంట్ సేఫ్‌గా ఉందనుకుంటున్నారా? మీ వాట్సప్ అకౌంట్‌ను సేఫ్‌గా మార్చేందుకు మీరు కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 48 కోట్ల మంది వాట్సప్ యూజర్లు ఉన్నారని అంచనా. 


2. స్నేహితులు, బంధువులతో నిత్యం ఛాట్ (WhatsApp Chat) చేయడానికి వాట్సప్ ఉపయోగిస్తున్నారు. అంతేకాదు... వాట్సప్ గ్రూప్స్‌తో స్నేహితులు, ఉద్యోగులు, బంధువులు రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారు. ప్రతీ ఒక్కరు రోజులో ఎన్నిసార్లు వాట్సప్ యాప్ ఓపెన్ చేస్తారో లెక్కే లేదు. మరి అలాంటి వాట్సప్‌ను సేఫ్‌గా మార్చుకోవడం స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అవసరం. మీ వాట్సప్‌ని సేఫ్‌గా మార్చే 5 ఫీచర్స్ ఏవో తెలుసుకోండి. 


3. 6-digit PIN: మీ వాట్సప్‌లో 6 డిజిట్ పిన్ సెట్ చేస్తే మీ అకౌంట్ సేఫ్‌గా ఉన్నట్టే. ఇక మీ నెంబర్ నుంచి ఎవరూ ఎక్కడ కూడా వాట్సప్ లాగిన్ చేయలేరు. మీరు క్రియేట్ చేసిన 6 అంకెల పిన్ ఎంటర్ చేస్తేనే అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఇన్‌స్టాల్ చేయాలన్నా ఈ పిన్ తప్పనిసరి. కాబట్టి పిన్ గుర్తుంచుకోండి. 


4. App Lock: మీ వాట్సప్ యాప్ లాక్ అయ్యేలాగా సెట్టింగ్స్ చేయండి. మీ ఫేస్ ఐడీ, టచ్ ఐడీ, ఫింగర్‌ప్రింట్ లాంటి ఫీచర్స్‌తో మీ వాట్సప్ ఓపెన్ చేయొచ్చు. ఇందుకోసం బయోమెట్రిక్ లాక్ ఫీచర్ ఉపయోగించాలి. ఇందుకోసం థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉండే యాప్ లాక్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. 


5. Disappearing messages: వాట్సప్ కొద్ది రోజుల క్రితం డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ రూపొందించింది. వాట్సప్‌లో కుప్పలుతెప్పలుగా వచ్చే మెసేజెస్‌కి ఓ పరిష్కారం చూపించింది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే పాత మెసేజెస్ అన్నీ వాటంతట అవే డిలిట్ అయిపోతాయి. 24 గంటలు, ఏడు రోజులు, 90 రోజుల డ్యూరేషన్‌తో ఈ సెట్టింగ్స్ చేయొచ్చు.


6. Block: ఎవరైనా అభ్యంతరకరమైన మెసేజెస్ పంపిస్తున్నారా? అయితే వారి అకౌంట్ బ్లాక్ చేయండి. బ్లాక్ చేయడం మాత్రమే కాదు... వారిపై రిపోర్ట్ చేసి వాట్సప్‌కు ఫిర్యాదు చేయొచ్చు. మీరు రిపోర్ట్ చేస్తే ఆ తర్వాత వాట్సప్ తీసుకోవాల్సిన చర్యల్ని తీసుకుంటుంది. ఒకే అకౌంట్‌పై ఎక్కువ కంప్లైంట్స్ వస్తే వారి అకౌంట్ బ్లాక్ చేస్తుంది వాట్సప్. 


​7. Admin controls: మీరు ఏదైనా వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారా? లేదా ఏదైనా వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నారా? అయితే అడ్మిన్‌గా మీకు ఉన్న అధికారాలు ఉపయోగించుకోవచ్చు. గ్రూప్‌లో ఎవరు మెసేజ్ పంపాలో మీరే డిసైడ్ చేయొచ్చు. త్వరలో మరిన్ని అధికారాలను అడ్మిన్లకు ఇవ్వబోతోంది వాట్సప్. (ప్రతీకాత్మక చిత్రం)

No comments:

Post a Comment

Post Top Ad