Groundnuts Health Benefits: ఉడకబెట్టిన పల్లీలు తినడం ఇష్టమా? ఇవి విడుదల చేసే సెరోటోనిన్‌ వల్ల.. - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Friday, February 25, 2022

Groundnuts Health Benefits: ఉడకబెట్టిన పల్లీలు తినడం ఇష్టమా? ఇవి విడుదల చేసే సెరోటోనిన్‌ వల్ల..

Groundnuts Health Benefits: ఉడకబెట్టిన పల్లీలు తినడం ఇష్టమా? ఇవి విడుదల చేసే సెరోటోనిన్‌ వల్ల..

 Groundnuts Health Benefits: ఉడకబెట్టిన పల్లీలు తినడం ఇష్టమా? ఇవి విడుదల చేసే సెరోటోనిన్‌ వల్ల..

Health Benefits Of Groundnuts: పొద్దున్నే టిఫిన్‌లోకి పల్లీల చట్నీ... సాయంత్రం బోర్‌ కొడితే వేయించిన పల్లీలతో స్నాక్స్‌ రెడీ. సాధారణంగా మన దేశంలోని ప్రతి వంటగదిలో దర్శనమిస్తాయి వేరుశెనగలు.. అదేనండీ పల్లీలు. అంతేకాదు మనలో ఎక్కువ శాతం మంది వేరుశనగల నుంచి తీసిన నూనెనే వంటకాల్లో వాడుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వేరుశెనగ పంట.. ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఇది ఒక ప్రధాన పంటగా పేరొందింది. వీటిని కొన్నిచోట్ల పల్లీలు అని కూడా పిలుస్తుంటారు. నిజానికి వేరుశనగలు బలవర్ధకమైన ఆహారం. నోటికి రుచిగా అనిపించే పల్లీల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం!

వేరుశెనలో ఉండే పోషకాలు: 

►వేరుశనగలో పిండి, పీచు పదార్థాలు అధికం. 

►ప్రొటిన్లు కూడా తగు మోతాదులో ఉంటాయి. 

►ఇక విటమిన్లలో సి, ఎ, బి6 ఎక్కువగా ఉంటాయి.

►ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు కూడా వేరుశెనగల్లో మెండు.

►సాధారణంగా 100 గ్రాముల వేరుశెనగల్లో సుమారుగా 567 కేలరీలు, 25.8 గ్రాముల ప్రొటిన్లు, 49.2 గ్రాముల ఫ్యాట్‌, 16.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8.5 గ్రాముల ఫైబర్‌ లభిస్తుంది.

వేరుశెనగలు/పల్లీల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

►పచ్చి పల్లీలు తీసుకుంటే గుండె పనితీరు మెరుగు అవతుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది.

►మెదడు పనితీరును కూడా పల్లీలు మెరుపరుస్తాయి.

►అల్జీమర్స్‌ను తగ్గించి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. వీటిలోని విటమిన్‌ బీ3 ఇందుకు దోహదం చేస్తాయి.

►ఉడకబెట్టిన పల్లీలు తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.

►చెడు కొవ్వును తగ్గిస్తాయి.

►సెరోటోనిన్‌(ఎమైనో ఆసిడ్‌ ట్రిప్టోఫాన్‌ నుంచి తయారయ్యే మోనోఎమైన్‌)ను విడుదల చేసి ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

►ఇందులో ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు, విటమిన్‌ ఇ అధికం. తద్వారా గుండె నుంచి ఇతర భాగాలకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు ముసుకుపోకుండా కాపాడతాయి. 

►పొట్టలో పడే క్యాన్సర్‌ను కూడా వేరుశెనగలు తప్పించగలవు. 

►మెదడుకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు కూడా ఇవి దోహదపడతాయి.

►బరువు, మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.


No comments:

Post a Comment

Post Top Ad