Android Tips: మీ స్మార్ట్‌ఫోన్‌లో మాల్‌వేర్ ఉందా? ఇలా గుర్తించి తొలగించండి - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Friday, February 25, 2022

Android Tips: మీ స్మార్ట్‌ఫోన్‌లో మాల్‌వేర్ ఉందా? ఇలా గుర్తించి తొలగించండి

Android Tips: మీ స్మార్ట్‌ఫోన్‌లో మాల్‌వేర్ ఉందా? ఇలా గుర్తించి తొలగించండి

 Android Tips: మీ స్మార్ట్‌ఫోన్‌లో మాల్‌వేర్ ఉందా? ఇలా గుర్తించి తొలగించండి

Android Tips | మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అయితే అలర్ట్. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో (Android Smartphones) ఇటీవల మాల్‌వేర్ కలకలం రేపుతోంది. మరి మీ మొబైల్‌లో కూడా మాల్‌వేర్ ఉందా? ఎలా తెలుసుకోవాలో, ఎలా డిలిట్ చేయాలో తెలుసుకోండి.

1. ఆండ్రాయిడ్ యాప్స్‌లో మాల్‌వేర్ నిత్యం కలకలం రేపుతూ ఉంటోంది. ప్రతీసారి పదుల సంఖ్యలో ఆండ్రాయిడ్ యాప్స్‌లో (Android Apps) మాల్‌వేర్ బయటపడుతుండటం స్మార్ట్‌ఫోన్ (Smartphone) యూజర్లను భయపెడుతోంది. మాల్‌వేర్ ఉన్న యాప్స్‌ని గూగుల్ గుర్తించి తొలగిస్తూనే ఉన్నా... అప్పటికే యూజర్ల స్మార్ట్‌ఫోన్‌లో ఆ యాప్ డౌన్‌లోడ్ అయి ఉండటం వారికి ముప్పే. 

2. గతంలో ఫీచర్ ఫోన్ కేవలం కాల్స్, మెసేజెస్ కోసం వాడేవారు. కానీ స్మార్ట్‌ఫోన్‌లో లక్షల రూపాయల లావాదేవీలు చేస్తుంటారు. కాబట్టి స్మార్ట్‌ఫోన్‌లో మాల్‌వేర్ ఉంటే యూజర్లకు చిక్కులు తప్పవు. కాబట్టి స్మార్ట్‌ఫోన్ యూజర్లు అప్రమత్తం కావడం అవసరం. చాలావరకు గూగుల్ సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు వస్తుంటాయి. అయితే మీ స్మార్ట్‌ఫోన్ తరచూ అప్‌డేట్ చేయకపోతే ఇలాంటి వైరస్‌లను గుర్తించడం కష్టం. 

3. అందుకే మీ స్మార్ట్‌ఫోన్‌లో మాల్‌వేర్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఇందుకోసం కొన్ని యాంటీవైరస్ యాప్స్ ఉన్నాయి. వాటిని డౌన్‌లోడ్ చేసి స్కాన్ చేస్తే మీ స్మార్ట్‌ఫోన్‌లో యాంటీవైరస్ సులువుగా గుర్తించొచ్చు. ఉదాహరణకు క్యాస్పర్‌స్కీ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ స్టెప్స్ ఫాలో అవండి. 

4. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో Kaspersky Internet Security సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేయాలి. Kaspersky Lab రూపొందించిన యాప్ మాత్రమే డౌన్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత క్యాస్పర్‌స్కీ యాప్ ఓపెన్ చేయాలి. టర్మ్స్ అండ్ కండీషన్స్ అంగీకరించాలి. యాప్ పర్మిషన్స్ కూడా ఇవ్వాలి. ఆ తర్వాత ready to scan మెసేజ్ కనిపిస్తుంది. 

5. Scan బటన్ ప్రెస్ చేయాలి. స్కానింగ్ పూర్తైన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏమైనా ఇష్యూస్ ఉంటే తెలుస్తాయి. మీ స్మార్ట్‌ఫోన్‌లో వైరస్ ఉంటే క్యాస్పర్‌స్కీ యాప్ గుర్తిస్తుంది. ఆ వైరస్‌ను మీ స్మార్ట్‌ఫోన్ నుంచి తొలగించాలి. ఏదైనా యాప్‌లో వైరస్ ఉంటే uninstall మెసేజ్ కనిపిస్తుంది. యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. 

6. క్యాస్పర్‌స్కీ ఇంటర్నెట్ సెక్యూరిటీ మొబైల్ యాప్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న క్రిటికల్ ఇష్యూస్ అన్నింటినీ గుర్తిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌కు చేటు చేసే ఫైల్స్‌ని స్కాన్ చేస్తుంది. అందులో సూచించినట్టుగా వాటిని తొలగిస్తే చాలు. ఆ తర్వాత మీ స్మార్ట్‌ఫోన్ ఓసారి రీస్టార్ట్ చేయాలి. 

7. క్యాస్పర్‌స్కీ ప్రీమియం ఫీచర్స్ కావాలనుకుంటే సబ్‌స్క్రైబ్ చేయొచ్చు. లేదా ఫ్రీ యాప్ వాడుకోవచ్చు. పైన చెప్పిన స్మార్ట్‌ఫోన్ స్కానింగ్ ఫ్రీ యాప్‌తో కూడా చేయొచ్చు. ఇక మీ స్మార్ట్‌ఫోన్‌ను తరచూ సెక్యూరిటీ అప్‌డేట్ చేస్తూ ఉండాలి. 


No comments:

Post a Comment

Post Top Ad