Viral Video: ఈ మేకకు ఏమైనా శక్తులున్నాయా..? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజనం.. - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Saturday, January 29, 2022

Viral Video: ఈ మేకకు ఏమైనా శక్తులున్నాయా..? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజనం..

 Viral Video: ఈ మేకకు ఏమైనా శక్తులున్నాయా..? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజనం..

Goat Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇంకొన్ని

 Viral Video: ఈ మేకకు ఏమైనా శక్తులున్నాయా..? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజనం..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇంకొన్ని అర్ధంకాకుండా ఎన్నో ఊహగానాలకు తావిస్తాయి. వాస్తవానికి అలాంటి గందరగోళ వీడియోలను చూడటానికి నెటిజన్లంతా ఇష్టపడతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూసి.. నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వైరల్ వీడియో ఓ మేకకు సంబంధించినది. రెప్పపాటులోపు మేక గోడపైకి ఎక్కుతుంది. మేకకు ఇదంతా ఎలా సాధ్యమైందంటూ నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. మేక గోడ ఎక్కిందా లేదా ఎగురుకుంటూ వెళ్లిందా అనేది ప్రజలు ఖచ్చితంగా నిర్ణయించలేకపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో ఈ వీడియోపై జోరుగా చర్చ సాగుతోంది.


సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించిన ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘ముందుకు వెళ్లాలనే పట్టుదలతో ఉన్నవారిని ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఆపదు’ అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు. ఈ వైరల్ వీడియోను మీరు గమనిస్తే.. దీనిలో ఉన్న మేక చాలా ఎత్తైన గోడను సెకన్ల వ్యవధిలోనే చేరుకుంటుంది. గోడపై చేరుకున్న ఈ మేకనుచూసి అందరూ షాక్ అవుతున్నారు.


వైరల్ వీడియో.. 




ఈ వీడియోలో మేక గోడ ఎక్కే తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇంత తక్కువ సమయంలోనే మేక గోడ ఎక్కడం ఎలా సాధ్యమైందంటూ పేర్కొంటున్నారు. ఈ వీడియోలోని మేక చాలా టాలెంటెడ్ అని.. కితాబిస్తున్నారు. అయితే మేక గోడ ఎక్కిందా.. ఎగిరి దూకిందా అని మళ్లీ మళ్లీ ఈ వీడియో చూస్తున్నామని పేర్కొంటున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 47.6 వేల మంది వీక్షించగా.. 4,000 మందికి పైగా లైక్ చేసారు.

No comments:

Post a Comment

Post Top Ad