Viral Photos: అక్కడ మద్యం తాగి పట్టుబడితే ఏ శిక్ష వేస్తారో తెలిస్తే షాక్..? - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Saturday, January 29, 2022

Viral Photos: అక్కడ మద్యం తాగి పట్టుబడితే ఏ శిక్ష వేస్తారో తెలిస్తే షాక్..?

Viral Photos: అక్కడ మద్యం తాగి పట్టుబడితే ఏ శిక్ష వేస్తారో తెలిస్తే షాక్..?

Viral Photos: తైవాన్‌లో పోలీసులు తాగి పట్టుబడిన డ్రైవర్లకు ఎలాంటి శిక్ష వేస్తారో తెలిస్తే అందరు షాక్ అవుతారు. ఈ శిక్ష వల్ల ఆ దేశంలో డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి.

 Viral Photos: అక్కడ మద్యం తాగి పట్టుబడితే ఏ శిక్ష వేస్తారో తెలిస్తే షాక్..?

మద్యం సేవించి వాహనం నడపడం ఎంత ప్రమాదకరమో అందరికి తెలుసు. అయినా కొంతమంది వినడం లేదు. కానీ డ్రంక్ అండ్‌ డ్రైవ్ విషయంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన చట్టాలు ఉంటాయి. తైవాన్‌లో కొందరు మద్యం తాగి వాహనాలు నడిపే వారికి విచిత్రమైన శిక్ష విధించారు. అదేంటో తెలిస్తే అందరు షాక్ అవుతారు. నిజానికి తైవాన్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన వారికి శిక్షలు విధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 11 మందిని తైవాన్ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని ఆస్పత్రికి తరలించి అర్థరాత్రి శవాగారాన్ని శుభ్రం చేయించారు. మృతదేహాలను శుభ్రం చేస్తున్నప్పుడు చాలా మంది డ్రైవర్లకు చేతులు, కాళ్లు వణికిపోయాయి. దీంతో ఇంకెప్పుడు మద్యం తాగి వాహనం నడపమని ప్రమాణం చేశారు. మీడియా నివేదికల ప్రకారం.. తైవాన్‌లోని కోషియోంగ్ నగర మేయర్ డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే మృతదేహాలను శుభ్రం చేయాల్సి ఉంటుందని ప్రకటించారు.


No comments:

Post a Comment

Post Top Ad