Solar power: ఇంటిపై సౌర విద్యుత్తు యూనిట్‌కు సులువుగా ప్రభుత్వ సబ్సిడీ - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Wednesday, January 26, 2022

Solar power: ఇంటిపై సౌర విద్యుత్తు యూనిట్‌కు సులువుగా ప్రభుత్వ సబ్సిడీ

Solar power: ఇంటిపై సౌర విద్యుత్తు యూనిట్‌కు సులువుగా ప్రభుత్వ సబ్సిడీ

 Solar power: ఇంటిపై సౌర విద్యుత్తు యూనిట్‌కు సులువుగా ప్రభుత్వ సబ్సిడీ


ఇంటి పైకప్పు మీద సౌర విద్యుత్తు పలకల యూనిట్‌ను (రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్యానెల్‌) ఇకపై సొంతంగా ఏర్పాటు చేసుకుని, ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చు. ఇప్పటి వరకు ‘సౌర విద్యుత్తు పలకల యూనిట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సంస్థల నుంచే కొనుగోలు చేసి, దాన్ని ఏర్పాటు చేసుకుంటేనే’ ప్రభుత్వ సబ్సిడీకి అర్హత లభిస్తోంది. ఈ నిబంధనను మార్చామని, ఇకపై ఎవరికి వారు సొంతంగా కానీ, లేక తమకు నచ్చిన సంస్థ నుంచి కానీ ‘రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్యానెల్‌’ యూనిట్‌ను కొనుగోలు చేసి, దాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత సంబంధిత ఫోటోతో సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని విద్యుత్తు, కొత్త-పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ఆర్‌కె.సింగ్‌ తెలిపారు. దరఖాస్తు అందిన 15 రోజుల్లోగా సంబంధిత విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్‌) మీటరింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తుంది. రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్యానెల్‌ యూనిట్‌కు 3 కిలోవాట్ల వరకు 40 శాతం, 10 కిలోవాట్ల సామర్థ్యానికి 20 శాతం సబ్సిడీని నెల రోజుల్లోగా డిస్కమ్‌ చెల్లిస్తుంది. నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం విద్యుత్తు ఇన్వర్టర్లు, సోలార్‌ ప్యానెళ్లు తయారు చేస్తున్న సంస్థల జాబితాను, వాటి ధరలను వినియోగదార్ల సౌకర్యార్థం ఇకపై కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రచురిస్తుంది. దీంతో ఎక్కువ మంది ప్రజలకు ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

No comments:

Post a Comment

Post Top Ad