LIC Credit Card: ఉచితంగా ఎల్ఐసీ క్రెడిట్ కార్డ్... మీరూ తీసుకోవచ్చు ఇలా - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Wednesday, January 26, 2022

LIC Credit Card: ఉచితంగా ఎల్ఐసీ క్రెడిట్ కార్డ్... మీరూ తీసుకోవచ్చు ఇలా

 LIC Credit Card: ఉచితంగా ఎల్ఐసీ క్రెడిట్ కార్డ్... మీరూ తీసుకోవచ్చు ఇలా

 LIC Credit Card: ఉచితంగా ఎల్ఐసీ క్రెడిట్ కార్డ్... మీరూ తీసుకోవచ్చు ఇలా

LIC Credit Card | ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు శుభవార్త. మీరు ఉచితంగా క్రెడిట్ కార్డ్ (Credit Card) తీసుకోవచ్చు. ఐడీబీఐ బ్యాంకుతో కలిసి ఈ క్రెడిట్ కార్డ్ అందిస్తోంది ఎల్ఐసీ. ఈ క్రెడిట్ కార్డుతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోండి.


లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) క్రెడిట్ కార్డ్ సేవల్ని కూడా అందిస్తుందన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. ఐడీబీఐ బ్యాంకుతో కలిసి ఎల్ఐసీ సీఎస్ఎల్ క్రెడిట్ కార్డుల్ని అందిస్తోంది ఈ ఇన్స్యూరెన్స్ కంపెనీ. కస్టమర్లకు రూపే క్రెడిట్ కార్డ్ (Rupay Credit Card) లభిస్తుంది. ఎల్ఐసీ పాలసీహోల్డర్లు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ ఉచితం. ల్యూమినీ కార్డ్, ఎక్లాట్ కార్డ్ పేరుతో రెండు రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఈ క్రెడిట్ కార్డ్ కేవలం ఎల్ఐసీ ఏజెంట్లు, ఎల్ఐసీ మెంబర్స్, పాలసీహోల్డర్లకు మాత్రమే. ఇతర కస్టమర్లకు ఈ క్రెడిట్ కార్డు లభించదన్న విషయం గుర్తుంచుకోవాలి.


ఐడీబీఐతో కలిసి ఎల్ఐసీ అందిస్తున్న ఈ క్రెడిట్ కార్డుతో అనేక లాభాలు ఉన్నాయి. ఈ రెండు కార్డుల్లో ఏ కార్డు తీసుకున్నా మెంబర్‌షిప్ ఛార్జ్, యాన్యువల్ ఫీజు ఉండదు. పాలసీహోల్డర్ తన పేరుతో ప్రైమరీ కార్డ్ తీసుకొని, మరో రెండు యాడ్ ఆన్ కార్డులు కూడా తీసుకోవచ్చు. ఒకే అకౌంట్‌తో కుటుంబ సభ్యుల పేర్ల మీద అదనంగా క్రెడిట్ కార్డులు తీసుకోవచ్చు. యాడ్ ఆన్ కార్డులు తీసుకోవడానికి ఎలాంటి ఛార్జీలు ఉండవు.


ఎల్ఐసీ క్రెడిట్ కార్డు తీసుకున్న మొదటి 60 రోజుల్లో రూ.10,000 పైనే ఖర్చు చేస్తే 1000 లేదా 1500 వెల్‌కమ్ బోనస్ డిలైట్ పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్‌తో లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్స్ కొనొచ్చు. మీరు ఎల్ఐసీ ప్రీమియం చెల్లించిన ప్రతీసారి రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఇక పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజిల్ కోసం ఈ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే సర్‌ఛార్జ్ ఉండదు. క్రెడిట్ లిమిట్ పాలసీహోల్డర్ క్రెడిట్ హిస్టరీని బట్టి ఉంటుంది.


ల్యూమినీ కార్డ్‌తో రూ.100 ఖర్చు చేస్తే 3 డిలైట్ పాయింట్స్ వస్తాయి. ఎక్లాట్ కార్డ్‌తో రూ.100 ఖర్చు చేస్తే 4 డిలైట్ పాయింట్స్ వస్తాయి. ఈ కార్డుతో ఎల్ఐసీ ప్రీమియం చెల్లిస్తే రెట్టింపు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ప్రతీ రూ.100 కు ఆరు నుంచి 8 రివార్డ్ పాయింట్స్ పొందొచ్చు. ఎల్ఐసీ ఐడీబీఐ ఎక్లాట్ క్రెడిట్ కార్డుతో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. ఈ కార్డుతో రూ.400 లేదా అంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తే 1 శాతం ఫ్యూయెల్ సర్‌ఛార్జ్ రీఇంబర్స్‌మెంట్ లభిస్తుంది.


రూ.3000 కన్నా ఎక్కువ చెల్లింపుల్ని ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. ఈఎంఐగా మార్చడానికి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫోర్‌క్లోజర్ ఫీజు లేదు. 3, 6, 9, 12 నెలల ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డులకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవరేజీ లభిస్తుంది. కార్డ్ హోల్డర్ ప్రమాదవశాత్తు మరణిస్తే ఇన్స్యూరెన్స్ మొత్తం నామినీకి లభిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన 90 రోజుల ముందు లావాదేవీలు జరిపి ఉండాలి.

No comments:

Post a Comment

Post Top Ad