సరోగసీ గర్భం ఇప్పుడు సెలెబ్రిటీల హాట్ ఫేవరేట్.. అసలు సరోగసీ అంటే ఏమిటి?.. - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Monday, January 24, 2022

సరోగసీ గర్భం ఇప్పుడు సెలెబ్రిటీల హాట్ ఫేవరేట్.. అసలు సరోగసీ అంటే ఏమిటి?..

సరోగసీ గర్భం ఇప్పుడు సెలెబ్రిటీల హాట్ ఫేవరేట్.. అసలు సరోగసీ అంటే ఏమిటి?..

సరోగసీ గర్భం ఇప్పుడు సెలెబ్రిటీల హాట్ ఫేవరేట్.. అసలు సరోగసీ అంటే ఏమిటి?..


సినీతారలు, వ్యాపారవేత్తులు, ప్రముఖులు పిల్లలను కనడానికి ఈ మధ్య సరగసీ పద్ధతిని అనుసరిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ అందాల భామ ప్రియంకా చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి జనవరి 21న సరోగసీ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరి ఖాన్, అలాగే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావులు కూడా ఇలాగే సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చారు. ఇదేకోవలో టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మంచు లక్షి దంపతులు కూడా సరోగసీ ద్వారా పిల్లలు పొందారు. వీరంతా ఈ పద్దతిని ఎందుకు అనుసరిస్తున్నారో తెలుసుకుందాం..


సరోగసీ అంటే ఏమిటి?సెలెబ్రిటీ దంపతులలో మహిళలు తమ శరీరం ద్వారా పిల్లలు కనడానకి ఇష్టపడరు. 9 నెలలు గర్బంలో పిల్లాడని మోయాలంటే చాలా కష్టంగా భావిస్తారు. సహజ పద్ధతిలో గర్భధారణ చేసి పిల్లలను కనాలంటే వారికి వృత్తి పరంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో సరోగసీ ఒక వరంలా ముందుకొచ్చింది. సరోగసీ అంటే దంపతులలో పురుషుడి వీర్యకణాలు, మహిళ అండాన్ని డాక్టర్లు కృత్రిమంగా ఫలదీకరించి దానిని పిండంగా మారుస్తారు. ఆ పిండాన్ని అద్దెకోసం తీసుకున్న మరో స్త్రీ గర్భంలో ప్రవేశపెడతారు. ఆ స్త్రీని సరోగేట్ మదర్ అని అంటారు.  ఆ సరోగేట్ మదర్ తన గర్భంలో 9 నెలలు పెంచి.. ఆ తరువాత జన్మనిస్తుంది. అలా జన్నించిన పిల్లాడిని అంగ్రీమెంటు ప్రకారం సెలెబ్రిటీ దంపతులకు ఇచ్చేస్తారు. బిడ్డ పుట్టాక ఆ సరోగేట్ మదర్ ఎటువంటి సంబంధం లేకుండా ముందుగానే ఒప్పందం చేసుకుంటారు.

ఇప్పుడు సరోగసీ ఒక వ్యాపారంగా మారిపోయింది. ఈ పద్ధతి ద్వారా పిల్లలు కోరుకునేవారు ఎక్కువ శాతం ధనికులే కావడం విశేషం. మరోవైపు సరోగేట్ మదర్‌ పనిచేయడానికి కూడా మహిళలు ముందుకు వస్తున్నారు. సరోగసీ కోసం పరిస్థితులను బట్టి కనీసం రూ.15 లక్షల నుంచి 30 లక్షల వరకు డబ్బు వసూలు చేస్తున్నారు.  

No comments:

Post a Comment

Post Top Ad