వైరలవుతున్న ఆదా శర్మ లేటెస్ట్ ఫోటో షూట్..! - Adah Sharma Latest Photoshoot
నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది ఆదా శర్మ. ఆ చిత్రంలో ఆమె తన గ్లామర్ తో పాటు.. నటనతో కూడా ఆకట్టుకుంది. కుర్రకారుకి క్రష్ గా కూడా మారిపోయింది.అయితే తరువాత ఈమెకు కథా ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కలేదు. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ‘గరం’ ‘క్షణం’ వంటి చిత్రాల్లో ఈమెకు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు దక్కలేదనే చెప్పాలి.
కొంచెం గ్యాప్ తరువాత చేసిన ‘కల్కి’ చిత్రం కూడా ఈమెకు మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. మొదటి సినిమా చూసినప్పుడు కచ్చితంగా ఆదా పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ వారు ఆశించినట్టు ఏమీ జరగలేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఇటీవల ఈమె ఓ ఫోటో షూట్లో పాల్గొంది. కానీ ఆ ఫోటోలు చూసినవాళ్ళందరికీ.. ‘దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయే’ అవకాశం ఉందనే చెప్పాలి. ‘ఓ గ్రీకు సుందరి లాగా రెడీ అయ్యి ఈ ఫోటో షూట్లో పాల్గొంది’ ఆదా శర్మ.
వీటిని చూస్తుంటే.. ప్రస్తుతం ఈమె హాలీవుడ్ ను టార్గెట్ చేసిందా అన్నట్టు అనిపించకమానదు. మన నెటిజన్లు కూడా అవే కామెంట్లు పెడుతున్నారు. అంతలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఆదా శర్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి
#adah sharma movies,
#adah sharma,
#adah sharma instagram,
#adah sharma husband,
#adah sharma biography,
#adah sharma twitter,
#adah sharma husband photos,
#adah sharma ki,
#adah sharma facebook,
#News Mozo


No comments:
Post a Comment